October 16, 2024
SGSTV NEWS
Andhra PradeshSpiritual

Watch Video: కరెన్సీ నోట్లతో అలంకారం.. ఆ అమ్మవారి ప్రత్యేకత ఇదే..

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామ దేవతైన శ్రీ ముసలమ్మ అమ్మవారి శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని కరెన్సీ (ధనలక్ష్మి) అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. 5 రోజులు పాటు 10 మంది ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో రూ.20 లక్షల నూతన కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు.

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామ దేవతైన శ్రీ ముసలమ్మ అమ్మవారి శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని కరెన్సీ (ధనలక్ష్మి) అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. 5 రోజులు పాటు 10 మంది ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో రూ.10 నుండి అయిదు వందల రూపాయల నూతన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. రాజమండ్రి, కడియం, మండపేట ఆలమూరు మండలాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుండి కరెన్సీ నోట్లతో అలంకరించిన ధనలక్ష్మి అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.


ధనలక్ష్మీ రూపంలో దర్శనమిచ్చిన శ్రీ ముసలమ్మ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆరున్నర దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా ఈ ప్రాంత వాసులు కొలుస్తారని వెల్లడించారు. గత ఐదేళ్ల క్రితం ఐదు లక్షలతో అలంకరణ ప్రారంభించి ఈ ఏడాది రూ. 20 లక్షలతో అలంకరణ చేసినట్లు తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక హారతులుతో పాటు భక్తి పారవస్యంతో కూడిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు

Also read

Related posts

Share via