October 16, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Krishna District: పశువు కంటే హీనం.. అందుకే తల్లి వీడ్ని కడతేర్చింది…

సమాజం తల దించుకునేలా జన్మనిచ్చిన తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భవిష్యత్తులో కూడా కొడుకుతో ఈ ముప్పు తప్పదని భావించిన తల్లి అతడిని అంతమొందించింది. తాడంకిలో తాపీమేస్త్రీ హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.

Also read :Andhra Pradesh: వామ్మో.. వీడు పోలీసులను చూస్తే సైకోలా మారతాడట.. పాపం ఆ హెడ్ కానిస్టేబుల్

పశువు కంటే హీనంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో తల్లితోనే అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తల్లి భరించలేకపోయింది. ఎప్పటికైనా ప్రమాదమే అని భావించి.. కన్న కొడుకునే అంతమొందించింది. రెండుళ్లుగా కొడుకుతో వేగలేకపోతున్నానని.. మానసిక క్షోభను అనభవించినట్లు ఆ తల్లి వాపోయింది. ఇక అతడి తీరు మారదని భావించి.. పచ్చడి బండతో కొట్టి చంపినట్లు పోలీసులు దర్యాప్తులో అంగీకరించింది. కేసుకు సంబంధించిన వివరాలను కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీసులు గురువారం వెల్లడించారు.

Also read :Tirumala: తిరుమలలో కల్తీ ఫుడ్ కలకలం.. పలు హోటళ్లని తనిఖీ చేసిన ఈవో.. నాణ్యతలేని వస్తువులు, పాడైన కూరగాయలను చూసి షాక్‌

తాడంకికి చెందిన గండికోట పద్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు రాంబాబుకు ఇంకా పెళ్లి కాలేదు. కూలి పనులకు వెళ్తుంటాడు. అతడు కొంతకాలానికి మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో… తల్లితో కూడా తప్పుగా ప్రవర్తించేవాడు. ఈ నెల 16న రాత్రి ఇంటికి వచ్చి లిక్కర్ సేవించాడు. ఆ మత్తులో తల్లితో తప్పుగా ప్రవర్తించగా.. ఆమె భయంతో ఆమె బయటకు వెళ్లిపోయింది. కొడుకుతో ఎప్పటికైనా ఈ ముప్పు ఉందని భావించిన ఆమె రాత్రి రెండు గంటల సమయంలో తిరిగొచ్చి మత్తులో మంచంపై పడుకుని ఉన్న కొడుకుని పచ్చడి బండతో తలపై బలంగా కొట్టి హతమార్చింది. అయితే పోలీసులను తప్పుదారి పట్టించేందుకు పద్మ నవారుతాడుతో కాళ్లు, చేతులు కట్టేసుకొని… కొడుకుని ఎవరో హత్య చేసినట్లు కట్టుకథ అల్లింది. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తులో నేరాన్ని అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన పచ్చడి బండ స్వాధీనం చేసుకొని.. నిందితురాలిని అరెస్టు చేశారు పోలీసులు. 24 గంటల్లో హత్య కేసు ఛేదించినందుకు పమిడిముక్కల పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.

Also read :Andhra Pradesh: ‘పిల్లలూ.. మీరు అల్లరి చేస్తే నేను చచ్చిపోతా..!’ బెదిరిద్దామనుకున్నాడు.. కానీ అంతలోనే..

Related posts

Share via