June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

AP News: గంగమ్మ జాతరలో అపశృతి.. ఆస్పత్రిలో చేరిన 100 మందిపైగా భక్తులు

చిత్తూరు జిల్లాలోని పాలసముద్రంలో జాతర సంబరం ఊరినే పడకేసేలా చేసింది. గ్రామంలో జరిగిన జాతరలో అపశృతి చోటు చేసుకుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో గంగ జాతరలో పాల్గొన్న గ్రామస్థులు అంబలి తాగి అస్వస్థతకు గురయ్యారు. వందలాది మంది వాంతులు, విరేచనాలకు గురి కావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. మంగళవారం రోజు జాతరను వేడుకగా నిర్వహించిన గ్రామస్థులు.. అమ్మవారి ప్రసాదంగా అంబలి తాగారు. ఇళ్లకు చేరుకున్న కొద్దిసేపటికే గ్రామస్తులు ఒక్కొక్కరు అస్వస్థతకు గురయ్యారు.

Also read :రూ. 30 లక్షలు కట్నం తీసుకుని.. పట్టుమని 15 రోజులు కూడా కాకుండానే..

బుధవారం సాయంత్రానికి అంబలి తాగిన ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు విరేచనాలతో పాటు జ్వరం రావడంతో పాలసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి క్యూ కట్టారు. ప్రాథమిక చికిత్స కోసం ఒక్కసారిగా వందలాది మంది రావడంతో వైద్య సిబ్బందికి కాస్త ఇబ్బందిగా మారింది. కొందరికి వారి ఇళ్ల వద్దనే వైద్య సేవలు అందించగా..మరికొద్ది మంది తమిళనాడులోని పలు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్న రెవెన్యూ, పోలీసు, RWS, వైద్య సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు.

Also read :AP news: జగన్ కు ఓటెయ్యాలని బెదిరించారు.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఎన్నికల ముందు అరాచకం

పాలసముద్రం బీసీ కాలనీలోనూ అంబిని తాగిన బాధితులు అస్వస్థతకు గురి కావడంతో అక్కడ కూడా వైద్య సిబ్బంది శిబిరాన్ని ఏర్పాటు చేసింది. గంగ జాతరలో జరిగిన అపశృతిపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం కాగా.. స్థానిక ఎమ్మెల్యే థామస్ ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక అధికారులను, వైద్య సిబ్బంది ఆదేశించారు.,

Also read :అవినీతికి అడ్డాగా సీసీఎస్!

Related posts

Share via