విశాఖ సెంట్రల్ జైలు మొబైల్ డంప్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జైలు అధికారుల ఫిర్యాదుతో విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. BNS 323, 111 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రౌడీషీటర్ హేమంత్‌కుమార్, రాజేష్ అనే ఇద్దర్ని నిందితులుగా చేర్చారు.
విశాఖ సెంట్రల్ జైలు పెన్నా బ్యారక్ సమీపంలోని భూమిలో పాతిపెట్టిన ప్యాకెట్ లభ్యమవడం.. అందులో రెండు మొబైల్స్, పవర్‌బ్యాంక్, డేటా కేబుల్స్ బయటపడడం తీవ్ర కలకలం రేపింది. జైలులో ఫోన్లు దొరకడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. అయితే.. పెన్నా బ్యారక్‌లో రౌడీషీటర్ హేమంత్‌తోపాటు.. మరికొందరు ఖైదీలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేస్తూ.. ఆ దిశగా దర్యాప్తు చేయడంతో గుట్టురట్టు అయింది. రౌడీషీటర్ హేమంత్‌కుమార్, రాజేష్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేశారు విశాఖ ఆరిలోవ పోలీసులు.
ఇదిలావుంటే.. మాజీ ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో రౌడీషీటర్ హేమంత్‌కుమార్ నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. మరోవైపు.. మొబైల్స్‌లో సిమ్‌కార్డులు లేకపోవడంతో.. ఆ సిమ్‌లను ఎక్కడ దాచారన్నదానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఆ సిమ్స్ బయటపడితే జైలులో దొరికిన మొబైల్స్ నుంచి ఎవరితో మాట్లాడారనేది తేలనుంది
Also Read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!