ఆ బావి కారణంగా ఇప్పుడు ఆ ఊరు ఫేమస్. ఆ బావిలో అంతగా ఏముంది అంటారా..? ఈ నీళ్ల వల్ల సంతానం కలుగుతుందన్న ప్రచారం ఉంది. అది కూడా ఏకంగా కవలలు పుడతారట. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఆ బావి నీటి కోసం నిత్యం జనం క్యూ కడుతుంటారు. ఆ బావి డీటేల్స్ తెలుసుకుందాం…
అది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామం. ఆ ఊర్లోని బావి చాలా ఫేమస్. ఎందుకంటే.. ఆ బావిలోని నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారన్న ప్రచారం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వెళ్లి ఇప్పటికీ ఆ బావిలో నీళ్లు తాగుతున్నారు. మాములుగా ఏదైనా ఊర్లో అరుదుగా కవలలు కనిపిస్తుంటారు. కానీ, దొడ్డిగుంటలో మాత్రం ఏ ఇంటి తలుపు తట్టినా.. కవలలే కనిపిస్తారు. గ్రామంలో.. 130 దాకా కవలలు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అందుకు ఆ భావి నీరే కారణమని కూడా అంటున్నారు. వార్తా ఛానళ్లు, పేపర్లు, సోషల్ మీడియాలో కూడా ఈ విషయం ప్రచారం అవ్వడంతో.. ఆ ప్రాంతానికి నిత్యం ఎంతోమంది వచ్చి.. నీళ్లు తాగి.. టిన్నులతో తీసుకెళ్తూ ఉంటారు. ఇలాంటి వాటిపై నమ్మకం లేనివారు కూడా ప్రయత్నిస్తే పోయేది ఏముంది అక్కడికి వచ్చి వాటర్ తాగుతున్నారు. విదేశాల్లో ఉండేవారు సైతం ఈ నీటిని అక్కడికి దిగుమతి చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
మరో విశేషం ఏంటంటే.. ఆ బావి నీళ్లు తాగిన రోగాలు కూడా నయమవుతాయని గ్రామస్తుల నమ్మకం. అందుకే ఊర్లో కుళాయిలు ఉన్నా.. చాలామంది బావి నీళ్లే తాగుతున్నారు. పిల్లలు పుట్టడంలో జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయని, ఇదంతా ట్రాష్ అని వైద్యులు ఈ నమ్మకాలను కొట్టివేస్తున్నారు. నీటి వల్ల పిల్లలు పుడతారన్న ప్రచారంలో నిజం లేదని జనవిజ్ఞాన వేదిక వాళ్లు కూడా చెబుతున్నారు. అది కేవలం కేవలం నమ్మకం మాత్రమేనని.. శాస్త్రీయత లేదని చెబుతున్నారు.వైజాగ్,హైదరాబాద్‌లోని అనేక ల్యాబ్స్‌లో ఇక్కడి నీటిని టెస్ట్ చేయించారు. కానీ ప్రత్యేకత ఏం కనిపించలేద. నిపుణులు ఏం చెబుతున్నప్పటికీ.. ఆ బావి వద్దకు వచ్చేవారి.. సంఖ్య మాత్రం తగ్గకపోవడం గమనార్హం.
Also read
- కార్మిక సంక్షేమ మండలి పధకాలను పునరుద్ధరించాలి…..ఐ.యఫ్.టి.యు.
- నేటి జాతకములు..4 ఏప్రిల్, 2025
- శ్రీ కృష్ణుడు మనవడు వజ్రనాభుడు నిర్మించిన ఆలయం ద్వారకాధీష ఆలయం.. ప్రాముఖ్యత ఏమిటంటే
- Dreams Theory: ముద్దు పెట్టుకుంటున్నట్లు కల కంటున్నారా.. ఆ కలకు అర్ధం తెలిస్తే ఆశ్చర్యపోతారు.
- కామదా ఏకాదశి: స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా శుభ సమయం? నియమాలు