మానవ జాతిని వణికిస్తోన్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ కూడా ఒకటి. ఆ వ్యాధి రావాలని కోరుకోరు. వచ్చినవారిని కూడా సమాజం నుంచి వెలివేసినట్లుగా చూడకూడదు. వారి గురించి గోప్యత పాటించాలి. కానీ HIV పాజిటివ్ వ్యక్తి.. విషయాన్ని దాచి మరో యువతిని పెళ్లాడాలనుకోవడం మాత్రం తప్పు. అందుకే డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ప్రతినిధులు రంగంలోకి దిగారు.
పెళ్లంటే అబ్బాయి విషయంలో జీవిత భాగస్వామిని తెచ్చుకోవడమేమోగాని.. అమ్మాయికి మాత్రం జీవితాన్నే మార్చే మధురఘట్టం. పుట్టినింటి నుంచి కోటి ఆశలతో ఆమె మెట్టినింట అడుగుపెడుతుంది. అలాంటి ఊహలతో తనకు భార్యగా వచ్చే అమ్మాయి జీవితంలో నిప్పులు కురిపించబోయాడు ఓ వ్యక్తి. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. అవును తాడేపల్లిలో HIV ఉన్న ఓ వ్యక్తి.. ఆ విషయం చెప్పకుండా ఓ అమ్మాయిని పెళ్లాడాలని చూశాడు. సరిగ్గా రింగ్స్ మార్చుకునే సమయంలో అక్కడికి డిస్ట్రిక్ట్ మహిళా ప్రతినిధులు అక్కడికి ఎంట్రి ఇచ్చి… వధువు తరుపువారికి గుండె బద్దలయ్యే వార్త చెప్పారు. పెళ్లి కొడుకు HIV పాజిటివ్ అని రిపోర్టులు చూపించారు. కరెక్ట్‌గా వివాహ సమయానికి విషయం తెలియడంతో.. చర్చి పాస్టర్ వెంటనే పెళ్లి ఆపేశారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని వివాహం జరిపించలేమని ఖరాఖండీగా చెప్పేశారు. దీంతో మహిళా ప్రతినిధులు, పెళ్లికూతురు బంధువులపై.. పెళ్లికొడుకు బంధువులు గొడవకు దిగారు. పీటల వరకు వచ్చిన పెళ్లిని ఎలా ఆపుతారంటూ హంగామా చేశారు. పెళ్లి కొడుక్కి HIV ఉన్న విషయం ఎందుకు దాచారంటే నీళ్లు నమిలారు.
గొడవ పెద్దది కావడంతో పోలీసులకు చర్చి పెద్దలు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాలకు సర్థిచెప్పి పంపించేశారు. అయితే అబ్బాయి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నారు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ప్రతినిధులు. HIV ఉన్న వ్యక్తిని బాధితుడిగా పరిగణిస్తామని.. అతడి గురించి గోప్యత పాటిస్తామని.. కానీ ఇలా విషయం చెప్పకుండా ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తామంటే ఒప్పుకోమన్నారు
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!