ఏసీబీ అధికారులు ఎంతమంది అవినీతి అధికారంలో ఉన్న పట్టుకుంటున్నా.. మరింత మందిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నా.. కొందరిలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. పని చేయాలంటే పైసలు ఇవ్వాల్సిందే..! ఫైలు కదలాలంటే జేబు నింపాల్సిందే..! అలా చేయకపోతే.. కార్యాలయం చుట్టూ తిరిగి కాళ్లు అరిగిపోవాలే తప్ప.. పని పూర్తి కాదు. అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అంటారే తప్ప.. మామూలు ఇవ్వనిదే కొంతమంది సంతకం పెట్టేందుకు ఇష్టపడరు. లంచం కోసం దరఖాస్తుదారులకు వాళ్ల టార్చర్ మామూలుగా ఉండదు మరి..!
పెందుర్తిలో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు జుత్తాడకు చెందిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు. ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేసుకున్నాడు. ఆ ఇంటికి పన్ను విధించాలని గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ కు కోరాడు. ఈ పనిని గ్రేట్ పై పంచాయతీ కార్యదర్శి విక్టర్ ప్రవీణ్‌కు అప్పగించారు. పనిచేసే పెట్టాలంటే 10వేలు లంచం చెల్లించాలని డిమాండ్ చేశారు ఆ అధికారులు. అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో.. 3000 వరకు అయితే అడ్జస్ట్ చేస్తానని చెప్పాడు బాధితుడు. అందుకు ససేమిరా అనడంతో ఎనిమిది వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఆ అధికారుల టార్చర్ తట్టుకోలేక.. లంచం ఇవ్వడం ఇష్టం లేక విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. పెందుర్తి పరిధిలోని జుత్తాడ గ్రామ సచివాలయం వద్ద లంచం తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శులు సత్యనారాయణ ప్రవీణ్ లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Also read
- నేటి జాతకములు..17 ఏప్రిల్, 2025
- Garuda Puranam: పాపాలు చేసే వారికి గరుడ పురాణం ప్రకారం విధించే దారుణమైన శిక్షలు ఇవే..
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్..! ఆ తర్వాత డెడ్‌బాడీ మాయం
- Shocking News: పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!
- ఇన్ స్టా లవర్‌తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..