June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

జల్సాలకు అలవాటు పడ్డ యువకులు.. చోరీ చేసిన వాహనాల్లో గుట్టు చప్పుడు కాకుండా..

జల్సాలకు అలవాటు పడ్డ యువకులు తమ ఆర్థిక అవసరాలకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. బైక్‌లు దొంగతనాలు చేసి అదే బైక్‌లపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా వై రామవరం మండలం డొంకరాయిలో ఓ మైనర్ బాలుడితో సహా ఐదుగురు యువకులు గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టు అయ్యారు.

Also read :జోగి రమేష్ పేరు చెప్పి రూ.15 లక్షల టోకరా

జల్సాలకు అలవాటు పడ్డ యువకులు తమ ఆర్థిక అవసరాలకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. బైక్‌లు దొంగతనాలు చేసి అదే బైక్‌లపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా వై రామవరం మండలం డొంకరాయిలో ఓ మైనర్ బాలుడితో సహా ఐదుగురు యువకులు గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టు అయ్యారు. వీరి వద్ద నుంచి ఐదు కేజీల గంజాయి, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాల్లో మూడు వాహనాలు చోరీకి గురైనవిగా పోలీసులు గుర్తించారు.

Also read :Burger King :కసితీరా 40 సార్లు కాల్చి.. బర్గర్ కింగ్‌లో యువకుడి దారుణ హత్య.. షాకింగ్….

వై రామవరం మండలం రాజుక్యాంపుకు చెందిన మండీ వెంకటేష్ తెలంగాణలోని మణుగూరు టౌన్ లో ఐటిఐ చదువుతూ మణుగూరు టౌన్ చెందిన షేక్ సంషీద్, మెరుగు సాయి కృష్ణ, కూకట్ల అఖిల్, పెరుమాళ్ళ జస్వంత్ లతో పరిచయం ఏర్పడింది. వీరు మణుగూరు చుట్టుపక్కల పాడైపోయిన ఫ్యాక్టరీలలో ఐరన్ స్క్రాప్ కాపర్ లారీ బ్యాటరీలను దొంగతనం చేసి జులాయిలుగా తిరుగుతుండేవారు. వీళ్ళ జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేసి ఆ వాహనాలపై గంజాయి అక్రమ రవాణాతో పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు బైక్‌లు దొంగిలించి వాటిపైనే గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు.

Also read :భారతీరెడ్డి పీఏ అరెస్టు?

కొత్తగూడెంలో రెండు బైకులను చోరీ చేసిన యువకులు.. కూనవరం సమీపంలో మరో బైకును దొంగలించినట్టు తెలిపారు. ఈ వాహనాలపై గంజాయి రవాణా చేసేందుకు సీలేరు వెళ్ళి అక్కడి నుండి ఒడిశాలోని రాస్ బేడ గ్రామానికి వెళ్ళిన యువకులు.. ఐదు కేజీల గంజాయి కొనుగోలు చేసి గంజాయితో మణుగూరు వెళ్లే క్రమంలో డొంకరాయిలో పోలీసులుకు పట్టుబడ్డారు. ఈమేరకు నిందితులను కోర్టుకు తరలించినట్లు తెలిపారు. మైనర్ బాలుడిని జువైనల్ కోర్టుకు తరలించినట్లు తెలిపారు

Also read :Telangana: ‘పుట్టనేమి! వాడు గిట్టనేమి..!’ నడివీధిలో అనాథగా ఓ తల్లి శవం! ఏ చెప్పుతో కొట్టాలి ఆ కొడుకుల్ని..

Related posts

Share via