ఓవర్ స్పీడ్లో పేలిన కారు టైర్, కట్ చేస్తే అక్కడిక్కడే నలుగురు మృతి.. ఎక్కడో తెలుసా? ఈ ఘటన విజయనగరం జిల్లాలో కేంద్రంలో చోటుచేసుకుంది. భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఫార్చ్యూనర్ కారు టైరు పంక్చర్ అయ్యి కారు బోల్తా పడింది.
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాపారులు మృతి చెందారు. భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఫార్చ్యూనర్ కారు టైరు పంక్చర్ అయ్యి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా శ్రీకాకుళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
శ్రీకాకుళం నుండి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలిపల్లి సమీపంలోనే పెట్రోల్ బంక్ వద్ద కారు బోల్తాపడి అక్కడినుండి విశాఖ నుండి శ్రీకాకుళం వెళ్లే రహదారి పైకి రావడంతో ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీ కొట్టింది. దీంతో ఒక మహిళతో పాటు నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన గవిడి కౌశిక్, వడ్డే అభినవ్, వడ్డే మణిమాల డ్రైవర్ జయష్ మృతి చెందారు. వీరిలో వడ్డే అభినవ్, మణిమాల భార్యాభర్తలు కాగా కౌశిక్ అభినవ్ స్నేహితులు.. కౌశిక్ మేనమామ విదేశాల నుండి వస్తుండటంతో అతనిని రిసీవ్ చేసుకునేందుకు కౌశిక్ తన ఫార్చ్యూనర్ కారులో విశాఖకు బయలుదేరాడు. అదే విషయాన్ని ముందు రోజు సాయంత్రం తన స్నేహితుడు అభినవ్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో అభినవ్ కూడా తన భార్య విశాఖ ఐబీపీఎస్‌లో పరీక్ష రాయాలని, తాము కూడా విశాఖ వస్తామని చెప్పడంతో అందరూ కలిసి కౌశిక్ కారులో బయలుదేరారు. అలా వైజాగ్ వెళ్తుండగా మార్గ మధ్యలో పోలిపల్లి సమీపంలో ప్రమాద సంభవించింది. కౌశిక్ బంగారం షాపు యజమాని కాగా అభినవ్ లియో ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. మృతి చెందిన భార్యాభర్తలకు ఒక ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. మరో యువకుడు కౌశిక్‌కు కూడా ఇటీవలే వివాహం జరిగింది. నలుగురు మృతితో శ్రీకాకుళం పట్టణం విషాదంలో మునిగిపోయింది. మృతిచెందిన వారు ప్రముఖ వ్యాపారవేత్తలు కావడంతో నివాళులు అర్పించేందుకు మృతుల కుటుంబాలకు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
Also read
- లక్కీ భాస్కర్ అవుతాం.. గోడ దూకి పారిపోయిన నలుగురు విద్యార్థులు..
- పోలీసుల అదుపులో మల్లికార్జునరావు
- Margasira Purnima: లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం కావాలంటే.. మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా
- Margashira Purnima: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మార్గశిర పౌర్ణమి రోజున ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలంటే..
- Annapurna Jayanti 2024: అన్నపూర్ణ జయంతి రోజున ఈ వస్తువులు దానం చేయండి..