November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

కసాయి కొడుకు. మరో దారిలేక కార్మికులే రిక్షాపై వృద్దురాలి అంత్యక్రియలు



మనిషన్నవాడు మాయమైపోతున్నాడు. మానవ సంబంధాలు చెదిరిపోతున్నాయి. రక్త సంబంధానికి విలువ లేదు. నవమాసాలు మోసి కన్న తల్లి అంటే లెక్కే లేదు. తాజాగా.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వెలుగుచూసిన ఓ ఘటన సభ్యసమాజాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం….

సభ్యసమాజం తల దించుకునే ఘటన ఇది. మానవ సంబంధాలు ఎలా దిగజారిపోతున్నాయో.. తెలియజేసే ఉదంతం.  నలుగురు పిల్లలు ఉన్నా… ఓ కన్నతల్లి అనాథగా మరణించింది. కనీసం అంతిమ సంస్కారాలు కూడా చేసే దిక్కులేక పారిశుధ్య కార్మికులు దహన సంస్కారాలు చేయాల్సి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.

చంద్రకంటి బొడ్డెమ్మ అనే మహిళ గత పది రోజులుగా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం దగ్గర ప్రసాదాలు తింటూ జీవిస్తున్నారు. ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నా ఎవరూ పట్టించుకోకపోవటంతో అనాథలా గుడి ముందు జీవనం సాగిస్తున్నారు. అయితే ఎండ తీవ్రత కారణంగా బొడ్డెమ్మ మృతి చెందారు.

ఈ విషయం తెలిసి కూడా ఆమె పిల్లలు అంతిమ సంస్కారాలు చేసేందుకు కుటంబ సభ్యులు ముందుకు రాలేదు. గ్రామస్థులు జోక్యం చేసుకోవటంతో నాలుగువేల రూపాయలు ఇచ్చి పారిశుధ్య కార్మికులను దహన సంస్కారాలు చేయమన్నాడు కసాయి కొడుకు. మరో దారిలేక కార్మికులే రిక్షాపై వృద్దురాలి మృతదేహాన్ని స్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

Also read

Related posts

Share via