విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. బాడంగి మండలం బొత్సవానివలసకు చెందిన గొట్టాపు శంకరరావు అనే ఆర్మీ జవాన్ జమ్మూ కాశ్మీర్‌లోని లడక్‌లో మృతి చెందాడు. శంకరరావు 2005లో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయి జవాన్‌గా చేరాడు. సుమారు 18 ఏళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న శంకరరావు.. అనేక పదోన్నతులు కూడా పొందాడు. ప్రస్తుతం లడఖ్‌లోని బి గ్రేడ్ వెల్డింగ్ షాప్ విభాగంలో వర్క్ చేస్తున్నాడు.
Also read :తెల్లారితే గృహప్రవేశం.. కలలుకన్న దంపతులు.. దర్శనమిచ్చిన కాళరాత్రి..
విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. బాడంగి మండలం బొత్సవానివలసకు చెందిన గొట్టాపు శంకరరావు అనే ఆర్మీ జవాన్ జమ్మూ కాశ్మీర్‌లోని లడక్‌లో మృతి చెందాడు. శంకరరావు 2005లో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయి జవాన్‌గా చేరాడు. సుమారు 18 ఏళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న శంకరరావు.. అనేక పదోన్నతులు కూడా పొందాడు. ప్రస్తుతం లడఖ్‌లోని బి గ్రేడ్ వెల్డింగ్ షాప్ విభాగంలో వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శంకరరావు ఎప్పటిలాగే వెల్డింగ్ వర్క్ చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు శంకరరావుతో పాటు మరొకరు చిక్కుకుపోయారు. గ్యాస్ సిలిండర్ పేలుడు శబ్దానికి ఉలిక్కిపడ్డ తోటి జవాన్లు అప్రమత్తమై పెద్ద ఎత్తున చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు అతికష్టం మీద మంటలు ఆర్పి వెల్డింగ్ డిపార్ట్మెంట్లోకి ప్రవేశించి చూసేసరికే శంకర్ రావుతో పాటు తోటి మరో జవాన్ కూడా మృతిచెంది ఉన్నారు. వెంటనే జరిగిన ఘటనను ఆర్మీ ఉన్నతాధికారులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న ఆర్మీ అధికారులు శంకరరావు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
Also read :ప్రభుత్వ ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. చికిత్స పొందుతున్న రోగి మృతి
శంకరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శంకరరావు పిల్లల చదువుల నిమిత్తం కుటుంబం విశాఖలో నివాసం ఉంటుంది. అయితే శంకరరావు మృతిచెందిన రోజే తన తమ్ముడు కుమార్తె బాలసారె శుభకార్యం స్వగ్రామమైన బొత్సవానివలసలో ఘనంగా జరుగుతుంది. ఆ కార్యక్రమానికి శంకరరావు భార్యాపిల్లలు కూడా వెళ్లారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున బంధువులు, గ్రామస్తులు ఆ కార్యకార్యంలో పాల్గొని సందడిగా ఉన్నారు. ఆ సమయంలోనే ఆర్మీ అధికారుల నుండి వచ్చిన ఫోన్ శుభకార్యంలో ఒక్కసారిగా అలజడి రేపింది. గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదంలో శంకర్ రావు చనిపోయాడన్న వార్త తెలుసుకొని అంతా ఉలిక్కిపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులందరూ శోకసముద్రంలో మునిగిపోయారు. మరొక ఆరు నెలల్లో రిటైర్డ్ అయ్యి ఇంటికి వచ్చి ఏదో ఒక వ్యాపారం చేసుకొని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుదామని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఇంతలోనే జరిగిన దుర్ఘటనలో శంకరరావు మృతి చెందడం గ్రామస్తులకు సైతం కన్నీటిని మిగిల్చింది. ప్రస్తుతానికి శంకరరావు మృతదేహాన్ని స్వగ్రామం చేర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామానికి చేరుకున్న తరువాత అధికారిక లాంఛనలతో అంత్యక్రియలు జరపనున్నారు ఆర్మీ అధికారులు