కాకినాడ, రమ్య నర్సింగ్ కాలేజి నిర్వాకం.. విద్యార్థినులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తిస్తున్నా.. ఫీజులు కట్టాలని వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో భయపడిన విద్యార్థినుల తల్లిదండ్రులు సగం ఫీజు చెల్లించారు. అయినా పూర్తిగా డబ్బులు కట్టలేదని రెండు రోజులుగా వారికి కనీసం భోజనం కూడా పెట్టడంలేదు. బయటకు చెబితే సర్టిఫికెట్లు ఇవ్వమని బెదిరిస్తున్నారు.
కాకినాడ: నగరంలోని వైసీపీ నేత పితాని అన్నవరానికి చెందిన రమ్య నర్సింగ్ కాలేజీ నిర్వాకం వెలుగు చూసింది. రెండో సంవత్సరం చదువుతున్న నర్సింగ్ కాలేజి విద్యార్ధినిలకు యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వారికి ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తిస్తున్నా.. ఫీజులు కట్టాలని వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో భయపడిన విద్యార్థినుల తల్లిదండ్రులు సగం ఫీజు చెల్లించారు. అయినా పూర్తిగా డబ్బులు కట్టలేదని రెండు రోజులుగా వారికి కనీసం భోజనం కూడా పెట్టడంలేదు. బయటకు చెబితే సర్టిఫికెట్లు ఇవ్వమని బెదిరిస్తున్నారు. బయటకు వెళ్లి తిందమన్నా.. భయంతో వెళ్ళలేక నలభై మంది విద్యార్థినులు పస్తులున్నారు. వారిలో ఎక్కువమంది విశాఖ,ఉత్తారాంద్ర.. ఉభయ గోదావరి జిల్లాకు చెందిన విద్యార్థినులు ఉన్నారు. పస్తులున్నా కనీసం నిర్వహకులు కనికరించడంలేదు.
కాగా ఎప్పుడూ వివాదాస్పదాంశాలతో తెరపైకి వచ్చే రమ్య హాస్పిటల్.. జులైలో కూడా మరో వివాదంతో తెరపైకి వచ్చింది. రమ్య హాస్పిటల్‌లోనే నర్సింగ్ కాలేజీ కూడా నడిపిస్తున్నారు. అయితే కాలేజీలో ఎలాంటి సదుపాయాలు లేవని, సరైన ఫ్యాకల్టీస్ కూడా లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కనీస అవసరాలు కూడా లేవని వాపోతున్నారు. మరీ ముఖ్యంగా రూమ్‌ల విషయంలో కాలేజీ యాజమాన్యం చెప్పిన దానికి, వాస్తవానికి పొంతనలేదని విద్యార్థులు చెబుతున్నారు. అడిగినా ఎవరూ సమాధానం చెప్పడంలేదని వాపోతున్నారు. 60 మందిని రెండు రూముల్లో ఉండాలని చెప్పారని, తాము జాయిన్ అయినప్పుడు నలుగురికి ఒక రూమ్ ఇస్తామని చెప్పి.. తీరా జాయిన్ అయిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారని వారు వాపోయారు. ఫుడ్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు. జాయిన్ అయినప్పుడు ఫీజు రూ. 18 వేలు చెప్పారని, తర్వాత ఫీజు రూ. 90 వేలకు పెంచారని, పీజు కట్టిన తర్వాతే హాల్ టిక్కెట్లు ఇస్తామని యాజమాన్యం చెబుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించలాని కోరుతున్నారు
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025