October 17, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

మద్యం మత్తా.. మజాకా..! కిక్కు తలెకెక్కడంతో… అతను టవరెక్కాడు.. ఆ తర్వాత అసలు సినిమా..

రాత్రంతా జోరువానలో టవర్ పైనే తిండి, నీరు లేకుండా గడిపాడు. అర్థరాత్రి అయినా కిందకు దిగుతాడు అనుకున్న ఫతేర్ సింగ్.. తెల్లవార్లు అక్కడే ఉన్నాడు. తెల్లవారిన తరువాత పోలీసులు, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీరా చూస్తే.
విజయనగరం జిల్లాలో ఓ మందు బాబు చేసిన రచ్చ మామూలుగా లేదు.. ఏకంగా రెండు డిపార్ట్‌మెంట్లకు ముచ్చెమటలు పట్టించాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి చుక్కలు చూపించాడు. హైటెన్షన్‌ కరెంట్ పోల్ ఎక్కి హల్ చల్ చేశాడు. అతన్ని కిందకి దించడానికి పోలీసులు, ఫైర్‌ సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. రాజస్థాన్ కి చెందిన ఫతేర్ సింగ్ తన తోటి స్నేహితులతో కలిసి విజయనగరం వచ్చి భవన నిర్మాణ పనులు చేస్తుంటాడు. సుమారు ఆరు నెలలుగా జిల్లా కేంద్రంలోని జె ఎన్ టి యూ జంక్షన్ లోనే నివాసం ఉంటూ ఆ ప్రాంతంలోనే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఫతేర్ సింగ్ ప్రతిరోజు మద్యం సేవిస్తుంటాడు. ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా గ్యాప్ లేకుండా మద్యం సేవిస్తూ పనులకు వెళ్లడం కూడా మానేశాడు.

Also read :Khammam: స్టూడెంట్స్ ఇష్టం వచ్చినట్లు హెయిర్ కట్ చేసిన టీచర్.. పెద్ద పెంటే అయిందిగా
ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో అతను నివాసం ఉంటున్న ఇంటికి సమీపంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ వద్దకు వెళ్లి లోపలకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. ఫతేర్ సింగ్ ను గమనించిన వాచ్ మెన్ అతనిని అడ్డుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఫతెర్ సింగ్ వాచ్ మెన్ తో గొడవపడ్డాడు. అయితే ఫతెర్ సింగ్ కి తెలుగు రాకపోవడం, వాచ్ మెన్ కి హిందీ రాకపోవడంతో గొడవ ముదిరింది. వీరిద్దరి వాగ్వాదంతో అపార్ట్మెంట్ వాసులు వెంటనే కిందకి వచ్చి ఫతేర్ సింగ్ దొంగ అనుకొని అతని పై దాడిచేసే ప్రయత్నం చేశారు. వెంటనే భయపడిన ఫతేర్ సింగ్ వారి నుండి తప్పించుకునే క్రమంలో సమీపంలోని 32 కెవి హైటెన్షన్‌ విద్యుత్ టవర్ పైకి ఎక్కాడు. అలా సుమారు రాత్రి ఏడు గంటలకు టవర్ ఎక్కిన ఫతేర్ సింగ్ రాత్రి పది అయినా కిందకి దిగలేదు.

Also read :కాలేజీలో ఇద్దరమ్మాయిల మధ్య వివాదం .. చివరికి ఆ రేంజ్ లో ఫైటింగ్

అతనిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ సిఐ బి.వెంకట్రావు తన సిబ్బందితో విద్యుత్ టవర్ వద్దకు చేరుకున్నారు. అయితే వర్షం కురుస్తుండటంతో ఎవరూ ఆ టవర్ ఎక్కడానికి సాహసించలేదు. అర్థరాత్రి పన్నెండు గంటల వరకు అనేక రకాలుగా ప్రయత్నించారు పోలీసులు. చివరకు చేసేదిలేక వెనుతిరిగారు. అయితే ఫతేర్ సింగ్ మాత్రం తెల్లవారేవరకు కిందకు దిగలేదు. రాత్రంతా జోరువానలో టవర్ పైనే తిండి, నీరు లేకుండా గడిపాడు. అర్థరాత్రి అయినా కిందకు దిగుతాడు అనుకున్న ఫతేర్ సింగ్.. తెల్లవార్లు అక్కడే ఉన్నాడు. తెల్లవారిన తరువాత పోలీసులు, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని ఫతేర్ సింగ్ ను ఎలాగోలా కిందకు దించారు. చివరకు తమ వద్ద మైకులలో హిందీలో ఫతేర్ సింగ్ కు అర్థమయ్యేటట్లు అనౌన్స్‌ చేశారు.. తనను ఏమీ చేయమని, నువ్వు నీరసంగా ఉన్నావు, నీ కోసం ఆహారం, నీళ్లు తెచ్చాం, నువ్వు కిందకు దిగు, నీకు మేము సహాయం చేస్తాము అని పదే పదే బతిమాలుకున్నారు.

Also read :Dog Meat Controversy: ‘వ్యాపారి బరితెగింపు..’ మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే..

చివరకు మైక్ లో మాట్లాడిన వన్ టౌన్ సీఐ వెంకట్రావు మాటలు విని ఆయన మాటలు నమ్మిన ఫతేర్ సింగ్ నెమ్మదిగా కిందకి దిగాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే నిద్ర, తిండి, నీరు లేని ఫతేర్ సింగ్ నీరసించిపోవడంతో వెంటనే అతనికి ఆహారం అందించి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అలా ఫతేర్ సింగ్ వ్యవహారం జిల్లా యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. చివరికి ఫతేర్ సింగ్ సేఫ్ గా కిందకు దిగడంతో హమ్మయ్యా అనుకున్నారు అందరూ.

Also read :Software Employees: ప్రాణాలు తీసిన ఓవర్ టేక్

Related posts

Share via