November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

మిర్చి లారీని ఆపిన పోలీసులు.. దర్యాప్తులో షాకింగ్ నిజాలు..

గుంటూరు జిల్లా మిర్చి సాగుకు పేరుగాంచింది. ఇక్కడున్న మిర్చి మార్కెట్ యార్డు ఏషియాలోనే అతి పెద్దది. ఇక్కడ నుండి మిర్చి ఇతర రాష్ట్రాలకు అలాగే ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇక్కడ నుండి లారీల్లోనే మిర్చిని ఎగుమతి చేస్తుంటారు. అలా మిర్చి లారీనే అపహరించి పోలీసులకు దొరికిపోయారు ముగ్గురు కేటుగాళ్లు.

Also read :సంచలనంగా మారిన ముచ్చుమర్రి బాలిక కేసులో నిందితుడు మృతి!

గుంటూరులోని శ్రీక్రిష్ణ ట్రేడర్స్ నుండి పదిహేను టన్నుల మిర్చితో ఒక లారీని పాట్నాకు బయలు దేరింది. లారీలో డ్రైవర్‎తో పాటు క్లీనర్ కూడా ఉన్నారు. అయితే లారీ ఏలూరు జిల్లా భీమడోలు వద్దకు వెళ్లే సరికి నలుగురు వ్యక్తులు లారీని ఆపారు. అంతేకాకుండా డ్రైవర్ క్లీనర్‎ను కొట్టి లారీని తమ స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నుండి లారీని తీసుకెళ్లిపోయారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీ క్రిష్ణ ట్రేడర్స్ గుంటూరులోని పెదకాకాని పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు.

Also read :ఆస్తి కోసం సొంత చెల్లెలిపై దారుణానికి తెగబడింది!
అయితే ఒక లారీ అనుమానాస్పదంగా ఉన్నట్లు మణుగూరు పోలీసులకు స్థానిక ఇసుక లారీ డ్రైవర్లు సమాచారం అందించారు. మణుగూరు సమీపంలోని కమలాపురం వద్ద ఉన్న లారీ సమీపంలోనే ఒక కారులో నలుగురు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. నూతన్ కుమార్, హరిక్రిష్ణ, తేజ్ కుమార్, కే మణికంఠలుగా నిర్ధారించుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని లారీని మణుగూరు పోలీస్ స్టేషన్‎కు తరలించారు. ఈ విషయాన్ని పెదకాకాని పోలీసులకు చేరవేశారు. లారీలో ఉన్న మిర్చి విలువ పదమూడు లక్షల ఉంటుందని పోలీసులు తెలిపారు. అసలు డ్రైవర్, క్లీనర్ ఏమయ్యారో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Also read :Telangana: వనజీవులను ముప్పు తిప్పలు పెట్టే నక్కలు ఆపదలో పడ్డాయి.. ఏం జరిగిందంటే..?

Related posts

Share via