February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్‌ కాల్‌తో రిటైర్డ్‌ టీచర్‌ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఎవ్వరినీ వదలకుండా అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా.. ఏపీలో మరో రిటైర్డ్ ఉపాధ్యాయుడి నుంచి సైబర్ నేరగాళ్లు లక్షలకు లక్షలు దోచుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటుచేసుకుంది.. గత కొంత కాలం నుంచి రిటైర్డ్‌ ఉపాధ్యాయులను టార్గెట్‌ చేస్తూ ఫోన్లు చేసి మీ మీద కేసులు ఉన్నాయంటూ భయభ్రాంతులను చేసి లక్షల రూపాయల డబ్బులు దోచుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు…


సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఎవ్వరినీ వదలకుండా అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా.. ఏపీలో మరో రిటైర్డ్ ఉపాధ్యాయుడి నుంచి సైబర్ నేరగాళ్లు లక్షలకు లక్షలు దోచుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటుచేసుకుంది.. గత కొంత కాలం నుంచి రిటైర్డ్‌ ఉపాధ్యాయులను టార్గెట్‌ చేస్తూ ఫోన్లు చేసి మీ మీద కేసులు ఉన్నాయంటూ భయభ్రాంతులను చేసి లక్షల రూపాయల డబ్బులు దోచుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు… తాజాగా ఓ రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడి నుంచి 36 లక్షలు కొట్టేశారు. ఆరునెలల క్రితం కనిగిరి ప్రభుత్వ హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నుంచి 16 లక్షలు రూపాయలు దోచుకున్నారు. తాజాగా రిటైర్డ్ ఉపాధ్యాయుడైన మూలే బ్రహ్మారెడ్డిని టార్గెట్ చేసి అతని వద్ద నుంచి 36లక్షల రూపాయలు దోచుకున్నారు.


2025 జనవరి 16వ తేదీన తాము టెలికాం డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని కనిగిరికి చెందిన రిటైర్డ్‌ హెడ్మాస్టర్‌ మూలే బ్రహ్మారెకి ఫోన్ వచ్చింది.. బెంగళూరు లోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ లో మాట్లాడాడు.. అక్కడ ఉండే ఎస్‌ఐ శివ ప్రసాద్ గారికి ఫోన్ చేసి మాట్లాడండి.. మీరు ఆ ఎస్ఐ ను రిక్వెస్ట్ చేసుకుంటే మీ మీద కేసు లేకుండా చేస్తారని తెలిపాడు ఆ అజ్ఞాత వ్యక్తి.. విషయం తెలుసుకుందామని ఎస్ఐ నెంబర్ కి ఫోన్ చేశాడు రిటైర్డ్‌ హెడ్మాస్టర్‌ బ్రహ్మారెడ్డి.. ఎస్‌ఐ వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి వాట్స్అప్ వీడియో కాల్ చేసి మీ మీద బెంగళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయిందని.. ఇల్లీగల్ కాంటాక్ట్ , అసభ్యకరంగా వాట్స్అప్ పోస్టులు పెట్టారంటూ కేసు నమోదు అయిందని తెలిపాడు.

చాలా జాగ్రత్తగా ఉండే ఆ రిటైర్డ్ ఉద్యోగి అధికారులమని.. సైబర్ మోసగాళ్లు ఫోన్ చేయడంతో ఒక్కసారిగా భయపడిపోయాడు. ఆ వీడియో కాల్‌లో పోలీస్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నానని వీడియో కాల్ చూపించాడు. మీ మీద కేసు నమోదైన వివరాలంటూ… ఒక ఫేక్‌ ప్రొఫైల్ వాట్సాప్ తో పంపాడు. దీంతో భయపడిపోయిన రిటైర్డ్ ఉద్యోగి బ్రహ్మారెడ్డి తాను అలాంటి వ్యక్తిని కాదని.. సమాజంలో చాలా గౌరవంగా బతుకుతున్నానంటూ వారించారు.. తాను అలాంటి పనులు చేయనని.. తన మీద కేసు లేకుండా చేయండని బ్రతిమిలాడడం మొదలుపెట్టారు..


సీఐతో మాట్లాడి మీ మీద కేసు లేకుండా చేస్తానని నమ్మబలికిన ఫేక్‌ ఎస్‌ఐ..
మరుసటి రోజు సీఐ వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి బ్రహ్మారెడ్డికి వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. మీ మీద ముంబైలో మరో మూడు కేసులు నమోదు అయ్యాయని తెలిపాడు. మీ ఆధార్ కార్డు నెంబర్‌కు లింకైన అకౌంట్ లో 3 కోట్ల రూపాయలు ఉన్నాయని, ఢిల్లీలో అరెస్ట్ అయిన సాదత్‌ ఖాన్ కు ఆ మూడు కోట్ల రూపాయలు గాను 10% కింద 30 లక్షలు రూపాయలు ఇచ్చారని తమ విచారణలో తేలిందని బెదిరించాడు.. సాదత్‌ ఖాన్ అరెస్టు చేసినట్లు ఫోటో వాట్సప్ కి పంపారు. దీంతో కంగారు పడిపోయిన బ్రహ్మయ్య తాను బెంగళూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి మీతో మాట్లాడతానని బదులిచ్చారు.. వెంటనే సిఐ డ్రస్సులో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ మీరు అలా వస్తే నాలుగు రోజులు కస్టడీలోకి తీసుకొని అరెస్టు చేయాల్సి వస్తుందని బెదరించాడు. మీరు రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు కాబట్టి మీ పరువు పోతుంది.. అది గ్రహించుకోవాలి సలహా ఇచ్చాడు. మీరు ఎవరికీ చెప్పకుండా ఉండాలని, 36 లక్షల రూపాయలు ఇస్తే మీ మీద కేసు లేకుండా చేస్తామని సైబర్ నేరగాళ్లు తెలిపారు.

సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మిన రిటైర్డ్ ఉద్యోగి బ్రహ్మయ్య ముందుగా తన ఫోన్ పే లో నుంచి వాళ్ళ యూపీఐ నెంబర్ కి కొంత డబ్బు పంపారు. ఆ తర్వాత యూపీఐ నెంబర్ పనిచేయకపోవడంతో ఆర్టిజిఎస్ ద్వారా SBI బ్యాంకు నుంచి ఒకసారి 8 లక్షలు, ఒకసారి 5 లక్షలు అలా మొత్తం మీద 36 లక్షలు ఆర్టిజిఎస్ ద్వారా పంపారు.. తన దగ్గర అంత డబ్బు లేకపోయినా బంధువుల దగ్గర అప్పు తీసుకుని మరి కేసు లేకుండా చేసుకుందామని జనవరి 29వ తేదీన మరో 5 లక్షలు తన కుమారుడిని అడిగాడు.. అంత మొత్తం ఎందుకు నాన్న అని నిలదీశాడు కొడుకు.. దీంతో తన మీద వేరే కేసులు ఉన్నాయని.. బెంగళూరు పోలీసులు ఫోన్ చేస్తున్నారని తెలిపారు. కనిగిరిలో ఉన్న తన నాన్నకు బెంగళూరు పోలీసులు ఫోను చేయడమేంటని అనుమానం వచ్చిన బ్రహ్మయ్య కుమారుడు ఇది సైబర్ నేరగాళ్ల పనే అని గ్రహించాడు… వాళ్ల నెంబర్ కి ఫోన్ చేసి తిట్టడం మొదలుపెట్టాడు. వెంటనే వాళ్ళందరూ స్విచ్ఛాఫ్ చేసేసారు.

అప్పటికే 36 లక్షల రూపాయలు మోసపోయిన రిటైర్డ్ ఉద్యోగి బ్రహ్మారెడ్డి కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Also read

Related posts

Share via