October 18, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Cyber Fraud: ఫోన్‌లోనే సంప్రదింపులు.. ఆన్‌లైన్‌లో నియామకాలు.. కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ళు..!

చిత్తూరు జిల్లా పలమనేరులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ మనీ యాప్ పేరుతో రూ. కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ళు DAAI యాప్ పేర కొత్త మోసానికి తెర తీశారు. రూ 12 వేలు డిపాజిట్ చేస్తే రోజుకు రూ. 1000 చొప్పున 25 రోజుల పాటు రూ 25 వేలు తిరిగి ఖాతాలకు జమ చేస్తామంటూ జనానికి ఆశ చూపారు. తీర డబ్బులు చెల్లించే సమయానికి చేతులెత్తేశారు.

Also read :దుర్గమ్మ గుడిలో చోరీ.. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

పలమనేరు మున్సిపాలిటీలోని మెప్మాలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజేష్‌ను మేనేజర్‌గా నియమించి మోసాలుకు పాల్పడ్డారు మాయగాళ్ళు. మెప్మా రిసోర్స్ పర్సన్ ఉద్యోగులను ఏజెంట్లుగా నియమించుకున్న రాజేష్ పెద్ద మొత్తంలో బిజినెస్ కొనసాగించారు. ఆన్ లైన్ యాప్ యాజమాన్యం ఎవరో తెలియకుండానే కేవలం ఫోన్ లోనే వ్యవహారం నడిపించిన రాజేష్ తాను కూడా మోసపోయాడు.

Also readHyderabad: టైర్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. అవుటర్‌పై ఆరేళ్ల బాలుడు మృతి..

నియామకాలన్నీ ఆన్‌లైన్‌లోనే, ఫోన్‌లోనే సంప్రదింపులు జరిపారు. ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి వేలాది మందిని సభ్యులుగా నమోదు చేయించారు. పొదుపు సంఘాల మహిళలే ప్రధాన టార్గెట్ గా సభ్యత్వ నమోదు చేశారు. ఆన్‌లైన్‌లో డిపాజిట్ చేసిన సభ్యునికి సకాలంలోనే వారి అకౌంట్స్ లో నగదు జమ చేసి నమ్మకం కలిగించిన కేటుగాళ్లు ఎట్టకేలకు భారీ మోసానికి పాల్పడ్డారు.

Also read :ఊపిరిపోతున్నా.. వీడని డ్రైవింగ్ పటిమ..! సలాం చేయాల్సిందే..

ప్రజల్లో విస్తృత ప్రచారం కోసం ఖరీదైన హోటళ్లలో మీటింగ్స్ పెట్టి యాప్ మేనేజర్ రాజేష్ ద్వారా నగదు పంపిణీ చేసిన యాప్ నిర్వాహకులు పక్కా ఫ్రాడ్ కు పాల్పడ్డారు. రాజేష్ స్థానికుడు కావడంతో నమ్మి మోసపోయారు. ఆన్‌లైన్ యాప్ ఏజెంట్లు పొదుపు సంఘాల రిసోర్స్ పర్సన్లు కావడంతో మహిళలు నమ్మి సభ్యులుగా చేరారు. సభ్యులు చెల్లించే సొమ్ము కన్నా అధికంగా డబ్బులు వస్తున్నాయని పెద్ద ఎత్తున ఆకర్షితులైన జనం నిండా మోసపోయారు. యాప్ మేనేజర్ గా చలామణి అయిన రాజేష్ పరారీలో ఉండగా, ప్రవాహంలా అకౌంట్లోకి నగదు కోట్లల్లో జమ కావడంతో యాప్ లావాదేవీలు నిలిచిపోయాయి.

Also read :ఊపిరిపోతున్నా.. వీడని డ్రైవింగ్ పటిమ..! సలాం చేయాల్సిందే..

గత శనివారం ఒక్కరోజే బంపర్ ఆఫర్ అంటూ కొత్త స్కీం ను యాప్ యాజమాన్యం ప్రచారంలోకి తెచ్చింది. డబ్బు ఎంత కడితే అంతకు రెండింతలు 15 రోజుల్లోనే చెల్లిస్తానంటూ యాప్ యాజమాన్యం జనాన్ని మోసం చేసేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. దీంతో యాప్ యాజమాన్యం ట్రాప్ లో పడ్డ జనం రూ. కోట్ల లో డిపాజిట్లు చేశారు. ఆదివారం నుంచి యాప్ సేవలు నిలిచిపోవడంతో ఒక్కొక్కరు చెవులు కొరుక్కొని మోస పోయినట్లు గుర్తించారు. DAAI యాప్ ఆర్థిక మోసానికి గురైన బాధితుల్లో రిటైర్డ్ ఉద్యోగులు, పోలీను కుటుంబాలు, రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యాశతో కోట్లల్లో డబ్బు పోగొట్టుకొన్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహార వెలుగు చూసింది. వందలాది మంది బాధితులు సుమారు రూ 10 కోట్లకుపైగా ప్రజల సొమ్ము దోచుకున్నట్టు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. పరారీలో ఉన్న రాజేష్ కోసం గాలిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Also read :America: అమెరికాలో నకిలీ క్యాన్సర్ మందులు విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన సంజయ్.. నేరం రుజువైతే ఏళ్ల జైలుశిక్ష?

Related posts

Share via