July 8, 2024
SGSTV NEWS
Andhra Pradesh

Watch Video: మేక పిల్లలకు ఆకలి తీర్చిన గోమాత.. తల్లిప్రేమకు ఆదర్శం ఈ దృశ్యం..

తల్లి ప్రేమకు మూగజీవాలు అతీతం కాదు. తమ పిల్లల్లకి పాలిచ్చి పోషించడమే కాదు. ఆకలితో ఉన్న మేక పిల్లలకు పాలిచ్చి సాకుతోంది ఓ గోమాత. జాతి వేరైనా.. పాలిచ్చి మాతృ ప్రేమను చాటుకుంది ఆ గోవు. కులం, మతం పేరుతో కొట్టుకుంటున్న నేటి సమాజంలో జాతులు వేరైనా ఒక్కటిగా కలిసి ఉంటూ ప్రేమను చాటుతున్న ఆ గోవు వీడియో వైరల్‎గా మారింది. ఆవును దేవతల తల్లి అని పిలుస్తారు. భారతదేశంలో గోమాతకు ఉన్న ప్రత్యేకత ఇక చెప్పనక్కర్లేదు. సాధు జంతువుగా పేరుగాంచిన గోవు తన జీవితాన్ని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. అల్లూరి జిల్లా ఏజెన్సీలో తన లేగ దూడతో సమానంగా మేక పిల్లలకు పాలిచ్చి సాకుతోంది ఓ గోమాత.

అల్లూరి జిల్లా ఏజెన్సీ జీకే వీధి మండలం చాపరాతిపాలెం గ్రామమది. విసిరి పారేసినటు అక్కడక్కడ గిరిజనుల ఇళ్లు దర్శనమిస్తుంటాయి. ఆ ప్రాంతంలోని కొండపై ఓ రైతు కంకిపాటి బాలరాజు నివసిస్తూ ఉంటాడు. అతనికి 10 మేకలు.. మరో పది ఆవులు ఉన్నాయి. ఓ ఆవుకు లేగదూడ, మరో మేకకు రెండు మేకపిల్లలు జన్మనిచ్చాయి. అయితే ఆ మేక పిల్లలకు తల్లి దగ్గర అవసరమైన పాలు లేక దూరం పెట్టడంతో ఆకలితో అలమటిస్తున్నాయి. దీంతో తన లేగదుడకు పాలనిచ్చే గోవు వైపు చూసాయి. ఆ రెండు మేకపిల్లలు కూడా ఆవు పాలకోసం ఆవుదగ్గరకు వెళ్లాయి. ఆ లేగ దూడతో సమానంగా ఆ రెండు మేకపిల్లలకు తన పాలను ఇచ్చి ఆకలి తీర్చింది గోమాత. తల్లి ప్రేమను మేక పిల్లలకు కూడా పించింది. మేక పిల్లలు పాలు తాగినా ఆవు మౌనంగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆవు మేకల మాతృ బంధాన్ని చూస్తే ముచ్చటగా ఉందని మురిసిపోతున్నాడు ఆవు యజమాని బాలరాజు. గోమాత తన లేగ దూడతో పాటు రెండు మేక పిల్లలకు పాలిచ్చే ఘటన చర్చనీయాంశమైంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఎంతైనా గోమాత కదా మరి అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. గోమాతకు సలాం చేస్తున్నారు

Also read :ద్వాపర కాలం నాటి ఈ శివాలయం వెరీ వెరీ స్పెషల్.. నిల్చున్న నందీశ్వరుడు.. కోరిక చెవిలో చెబితే శివయ్యకు చేరవేస్తాడని నమ్మకం

Related posts

Share via