February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

AP News: పొద్దున్నే తన మిరప చేనుకు వెళ్లిన రైతు.. నడి పొలంలో కనిపించింది చూసి షాక్



కంప్యూటర్, సెన్సార్, రిమోట్ ..కాలంలోనూ క్షుద్ర పూజలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ పొలంలోనే కుద్రపూజలు చేసిన ఘటన కర్నూలు జిల్లా లో వెలుగుచూసింది. దీంతో గ్రామస్థులు భయపడుతున్నారు. రైతులు, రైతు కూలీలు ఆ ప్రాంతానికి వెళ్లడానికే భయపడుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..


కర్నూలు జిల్లా పెద్దకడబూరు గ్రామానికి చెందిన ఉప్పర ఈరన్న అనే రైతు పొలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. దాయాదులు మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో 7 సంవత్సరాల నుంచి బీడుభూములగా పడ్డాయి. గతంలో కూడా ఇలాగే రెండు మూడుసార్లు క్షుద్ర పూజలు చేశారు. అప్పటి నుంచి ఈరన్న భార్య కళ్లు, చేతులు గుంజుతున్నాయని, తండ్రికి చేతుల విరిగి బాధపడుతున్నట్లు చెబుతున్నారు.  ఉప్పర ఈరన్న మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుంచి మాకు మా అన్నదమ్ములకు భూ సమస్యలు ఉన్నాయన్నారు . ఏడు సంవత్సరాల నుంచి మా పొలాలు బీడు భూములుగా వున్నాయని తెలిపారు . కోర్టులో తాను గెలవడంతో  అన్నదమ్ములే ఈ క్షుద్రపూజలు చేసిఉంటారని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాను కోర్టులో గెలిచినా అన్నదమ్ముల అందరూ కలిసి మాట్లాడుకుందాం రండి అంటే రావట్లేదని ఆయన అన్నారు. గతంలోను కూడా పైరు చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి పూజలు చేశారని. అప్పుడు తన భార్యకు ఇప్పటివరకు ఆరోగ్యం బాగోలేదని, అలాగే నాలుగు రోజుల కింద కూడా ఎర్రనేల పొలంలో ఇలానే చేశారన్నారు . చేసిన రెండు రోజుల్లోనే తన తండ్రికి చేయి విరిగిందని ఈరన్న చెబుతున్నాడు. క్షుద్ర పూజలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈరన్న పోలీసులను కోరారు. క్షుద్ర పూజలు చేసినట్లు అనుమానిస్తున్న పూర్ణచంద్ర అనే అతన్ని తీసుకొస్తే నిజాలు తెలుస్తాయని..  ఉప్పర ఈరన్న పోలీసులకు చెబుతున్నాడు. ఈ క్షుద్రపూజలు చేయించింది తన అన్నదమ్ములే అని బల్లగుద్ది చెబుతున్నాడు. ఈ క్షుద్రపూజలు చేసింది బయట వ్యక్తులా, ఇంటి వాళ్లా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్షుద్రపూజలను చూసి చుట్టుపక్కల ఉన్న పోలాలు రైతులు, కూలీలు భయాందోళనకు గురవుతున్నారు.

Also read



Related posts

Share via