ఎమ్మెల్యే పదవి కోసం దశాబ్ద కాలం ఎదురు చూసిన పవన్ కల్యాణ్, ఏకంగా ఉప ముఖ్యమంత్రి దక్కించుకున్నారు. జనం కోసం నేను, జనంలో నేను అన్నట్లు అప్పడే ప్రజా సమస్యలపై యుద్దం ప్రకటించారు. ఐదేళ్ల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం, తాను చేయాలనుకున్న కార్యక్రమాలపై పవన్ దృష్టి దృష్టి సారించారు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ప్రత్యేకత ఉండాలాల్సిందే..! సినిమాల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న వపన్, రాజకీయాల్లోనూ తను డిఫరెంట్ అని నిరూపించుకున్నారు. ఎమ్మెల్యే పదవి కోసం దశాబ్ద కాలం ఎదురు చూసిన పవన్ కల్యాణ్, ఏకంగా ఉప ముఖ్యమంత్రి దక్కించుకున్నారు. జనం కోసం నేను, జనంలో నేను అన్నట్లు అప్పడే ప్రజా సమస్యలపై యుద్దం ప్రకటించారు. ఐదేళ్ల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం, తాను చేయాలనుకున్న కార్యక్రమాలపై పవన్ దృష్టి సారించారు.
జనవాణి సభలలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఆయన వాటి పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. తాజాగా ప్రజాసమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తన కుమార్తె కనిపించడం లేదని పవన్ కల్యాణ్‌ను ఆశ్రయించిన మహిళకు బాసటగా నిలిచారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన శివకుమారి డిప్యూటీ సీఎంకి ఫిర్యాదు చేసింది. పవన్‌ను కలిసి ఆమె తన కూతురు జాడ కోసం మొరపెట్టుకుంది. విజయవాడలో చదువుకుంటున్న తన మైనర్ కుమార్తెను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని కన్నీటి పర్యంతమైంది. మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, తమ కుమార్తె జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని గోడు వెళ్లబోసుకుంది
దీనిపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మాచవరం సీఐకు స్వయంగా ఫోన్ చేసి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలిక అచూకీ తెలుసుకోవాలంటూ జనసేన నాయకులను వెంట ఇచ్చి, బాధితులను మాచవరం పోలీస్ స్టేషన్‌కు పంపించారు. బాధితులకు అండగా ఉండాలని నేతలకు సూచించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో బాలిక మిస్సింగ్ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించామని పోలీసులు తెలిపారు.