April 8, 2025
SGSTV NEWS
CrimeInternational

AP News: అయ్యో భగవంతుడా.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్‌ జెట్టి హారిక(25)… భవిత బాగుంటుందని… ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. బిడ్డ జీవితం బాగుంటుందని ఆశించిన ఆమె తల్లిదండ్రులు ఆశలన్ని ఆవిరయ్యాయి. రోడ్డు ప్రమాదంలో హారిక దుర్మరణం పాలయ్యింది.

Also read :AP News: 108 అంబులెన్స్‌‌ను సీజ్ చేసిన పోలీసులు.. రీజన్ ఇదే…

ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువతి అనుకోని విధంగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జెట్టి హారిక.. న్యూట్రిషన్‌, ఫుడ్‌ అండ్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేసేందుకు గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లింది. అయితే.. అమెరికాలోని ఒక్లహామా స్టేట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Also read :Nizamabad: పోలీసుల అదుపులో యూనియన్ బ్యాంక్ మేనేజర్?

భారత టైమింగ్స్ ప్రకారం ఆదివారం మార్నింగ్ సమయంలో ఆమె తన విధులు కంప్లీట్ అయ్యాక తోటి వారితో కలిసి కారులో ఇంటికి బయల్దేరారు. అందులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తుండగా.. హారిక వెనుక సీటులో కూర్చుంది. వీరి కారు వెళ్తున్న మార్గంలో ఓ బైక్ నడుపుతున్న వ్యక్తి… కిందపడటంతో.. వెంటనే సడన్ బ్రేక్ వేసి కారును నిలిపేశారు. దాంతో వెనుక నుంచి ఒకదాని వెంట మరొకటి మొత్తం 3 వాహనాలు హారిక ప్రయాణిస్తున్న కారును ఢీకొన్నాయి. యాక్సిడెంట్‌లో హారిక స్పాట్‌లో చనిపోగా.. మిగిలిన వారికి గాయాలయ్యాయి.

Also read :గుర్తుపెట్టుకో! ఎల్ల‌కాలం ఇదే మాదిరిగా సాగదు.. రచ్చరచ్చ చేసిన జగన్

హారిక తండ్రి జెట్టి శ్రీనివాసరావు.. దేవదాయ శాఖలో సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే.. తమ కూతురి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సహకరించాలని వేడుకున్నారు హారిక కుటుంబ సభ్యులు. పేద కుటుంబానికి చెందిన తాము.. బ్యాంకు లోన్లు తీసుకుని మరీ.. ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించామని తెలిపారు. మంత్రి నారా లోకేష్‌పాటు.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని.. తమ కూతురి మృతదేహం స్వగ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు

Also read :భార్య- 10 నెలల బిడ్డను హత్య చేసిన భర్త.. తర్వాత మరో ఘోరం..!

Related posts

Share via