అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలో MS చదువుతున్న ఓ యువతి రోడ్డు ప్రమాదంలో మరణించింది. యువతి తన స్నేహితులతో కలసి కారులో ప్రయాణిస్తూ ఉండగా ఓ ట్రక్కు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది… వీరిలో యువతి అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు..
తెనాలి, డిసెంబర్ 15: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమంలో గుంటూరు జిల్లా తెనాలి యువతి దుర్మరణం చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…
తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగ శ్రీవందన పరిమళ (26) అమెరికాకు 2022 డిసెంబరులో వెళ్లింది. అక్కడి టెన్నెసీ రాష్ట్రంలో మెంఫిస్‌లో ఎంఎస్ చదువుతుంది. మెంఫిస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (MS) డిగ్రీ చదువుతుంది. శుక్రవారం రాత్రి ఆమె ఆమె స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా రాక్‌వుడ్ ఎవెన్యూ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన శ్రీవందనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు.
అదే ప్రమాదంలో కారులో ఉన్న పవన్, నికిత్ అనే మరో ఇద్దరు తెలుగు విద్యార్ధులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారురు. ప్రస్తుతం వీరిలో పవన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పరిమళ మృతదేహాన్ని అమెరికా నుంచి వీలైనంత తొందరగా తెనాలికి తీసుకొచ్చేందుకు తానా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని మృతురాలి బంధువులు వెల్లడించారు. కాగా గత కొంతకాలంగా వివిధ కారణాల వల్ల అమెరికాలో ఉంటున్న ఇండియన్ విద్యార్ధులు వరుసగా మృతి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంల తాజాగా మరోమారు తెలుగు విద్యార్ధి మరణించడంతో అసలిది యాక్సిడెంటా? దీని వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Mastan Sai Arrest: సెలబ్రిటీల బాత్రూమ్, బెడ్రూముల్లో స్పై కెమెరాలు.. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌తో ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ!
- ఛీ ఛీ.. ఏం కొడుకుల్రా మీరు.. తండ్రి శవాన్ని ముక్కలుగా నరికి
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్‌తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..