February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

ఎంత ఘోరం… విద్యార్థికి తృటిలో తప్పిన ప్రాణాపాయం..స్కూల్‌లో జరిగిన ప్రమాదంతో..


వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్ధిని టంగుటూరులోని ఓ ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని రిమ్స్‌ ఆసుపత్రికి తరించారు… పాఠశాలలో విద్యార్ధులతో పనిచేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి పాఠశాల ప్రిన్సిపల్‌ బాధ్యత వహించాలని విద్యార్ధి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు… మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామానికి చెందిన మధుమోహన్‌ తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు.


ప్రకాశంజిల్లా టంగుటూరులో దారుణం చోటు చేసుకుంది… మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్ధిపై వేడిపాలు పడటంతో తీవ్ర గాయాలయ్యాయి… గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న మాచేపల్లి మధుమోహన్‌ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ వేడిపాలు ఒంటిపై పడ్డాయి… పాలు చాలా వేడిగా ఉండటంతో విద్యార్ధి ఒళ్ళంతా కాలి బొబ్బలు తేలాయి… వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్ధిని టంగుటూరులోని ఓ ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని రిమ్స్‌ ఆసుపత్రికి తరించారు…

పాఠశాలలో విద్యార్ధులతో పనిచేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దీనికి పాఠశాల ప్రిన్సిపల్‌ బాధ్యత వహించాలని విద్యార్ధి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు… మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామానికి చెందిన మధుమోహన్‌ తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు… ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపించి ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు…

ప్రకాశంజిల్లా టంగుటూరులో వేడిపాలు ఒంటిపై పడి గాయాలైన 5వ తరగతి విద్యార్ధి మధుమోహన్‌ను ఎపి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి బాలవీరాంజనేయస్వామి పరామర్శించారు… సియం సహాయనిధి ద్వారా విద్యార్ధికి అయ్యే వైద్యఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు… పాఠశాలలో అనుకోని ఘటన జరిగిందని, 20 శాతం ఒళ్ళు కాలిందని మంత్రి తెలిపారు… విద్యార్ధి ప్రస్తుతం కోలుకుంటున్నాడని, ఎలాంటి ప్రాణాపాయం లేదని అన్నారు… గాయపడి ఆసుపత్రికి వచ్చిన విద్యార్ధికి వెంటనే ట్రీట్‌మెంట్‌ ప్రారంభించిన కిమ్స్‌ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు… ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు… ఈ ఘటనలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామని మంత్రి స్వామి తెలిపారు.

Also read

Related posts

Share via