February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

AP News: లవర్ అలా చేశాడని 100కి డయల్ చేసిన యువతి.. పోలీసులు రియాక్షన్ చూస్తే



డయల్ 100కి సాధారణం ఎలాంటి విషయాలపై కాల్ చేస్తుంటాం చెప్పండి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. ఇలా యువతులు, మహిళలు.. పలు కంప్లయింట్స్ ఇస్తుంటారు. ఈ తరుణంలో అనంతపురంకు చెందిన అమ్మాయి.. డయల్ 100ని ఆశ్రయించింది. ఆమె ఏం సాయం కోరిందంటే..

సాధారణంగా యువతులు, మహిళలు.. పోలీసులకు న్యాయం చేయండంటూ డయల్ 100కి కాల్ చేస్తారు. ప్రేమ పేరుతో మోసం చేశాడని.. గర్భవతిని చేసి ముఖం చాటేశాడని.. తన నగలు, డబ్బుతో లవర్ పరారయ్యాడని చెబుతూ కాల్ చేస్తుంటారు. ఇలాంటి కేసులు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మేము చెప్పెబోయే కేసు.. కొంచెం డిఫరెంట్.. ఓ యువతి డయల్ 100కి ఫోన్ చేసింది. ‘తన బాయ్ ఫ్రెండ్ నా నెంబర్ బ్లాక్ చేశాడు.. దయచేసి సాయం చేయండి’ అంటూ కోరింది. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..
బాయ్‌ఫ్రెండ్ తన నెంబర్ బ్లాక్ చేశాడని ఓ యువతి డయల్ 100కు కాల్ చేసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. ఇక ఆమె అడగిన సాయానికి అనంతపురం పోలీసులు దెబ్బకు షాక్ అయ్యారు. ‘అతను నాతొ మాట్లాడట్లేదు. నెంబర్ బ్లాక్ చేశాడు. మీరు వాడితో మాట్లాడి నా నెంబర్ అన్‌బ్లాక్ చేయించండి’ అని ఫోన్‌ చేసి సాయం కోరింది సదరు యువతి. ఇలా ఫోన్ చేసిన ఆ యువతి సెన్సిటివ్ అనుకున్నారో.. ఏంటో.. వెంటనే కంట్రోల్ రూమ్.. ఆమె ఫిర్యాదును గుత్తి పీఎస్ బ్లూ కోల్ట్స్‌కు ఫార్వార్డ్ చేసింది. ఇక గుత్తి పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ సుధాకర్.. ఆ యువతిని సంప్రదించాడు. అయితే తన ఇంటికి రావొద్దని నెంబర్ అన్‌బ్లాక్ చేయిస్తే చాలని యువతి చెప్పింది. దీంతో సదరు కానిస్టేబుల్ ఆమె బాయ్‌ఫ్రెండ్‌ మొబైల్ నెంబర్‌కి ఫోన్ చేశాడు. అయితే అతడు లిఫ్ట్ చేయలేదు. దీంతో పీఎస్‌కు వచ్చి కంప్లయింట్ చేయాలని ఆమెను వారు సూచించారు. కాగా, డయల్ 100ని ఇలా కూడా వాడేస్తున్నారా అని కొందరు షాక్ అవుతున్నారు

Also read

Related posts

Share via