పండించిన పంటను అమ్మాడు.. మొత్తం రూ.500 నోట్లే.. డబ్బుకట్టను ఇంటికి తెచ్చాడు.. ఇంట్లో ఉన్న బీరువాలో పెట్టాడు.. తెల్లారే వాటిలోంచి తీసి.. అవసరాల కోసం ఉపయోగిద్దామనుకున్నాడు.. కట్ చేస్తే.. ఎలుకలు అతని కలలను కల్లలుగా చేశాయి.. మొత్తం నోట్లను కొరికేశాయి.. ఈ విచిత్రమైన పరిస్థితి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ రైతుకి ఎదురైంది. కష్టపడి పండించిన పంటను అమ్ముకుంటే ఆ సొమ్ము మొత్తం ఎలుకలపాలైంది. నిన్న రాత్రి ఐదు వందల రూపాయల నోట్ల కట్టను బీరువాలో పెడితే… తెల్లారిసరికే ముక్కలు ముక్కలు చేసేశాయ్ ఎలుకలు. ఉదయం బీరువా తెరిచిన రైతు… ముక్కలైన నోట్లను చూసుకుని లబోదిబోమంటున్నాడు. ఈ ఘటన జి.మాడుగల మండలం రాపల్లి గ్రామంలో జరిగింది..
పసుపును పండించే రైతు బుఠారీ రామారావు… ఎప్పటిలాగే సంతలో పంటను అమ్ముకున్నాడు. మొత్తం పది వేల రూపాయలు వచ్చాయి. అన్నీ ఐదు వందల రూపాయల నోట్లే. ఆ డబ్బును తీసుకొచ్చి బీరువాలో దాచుకున్నాడు రామారావు. ఇవాళ లేచి చూసుకునేసరికి నోట్లు మొత్తం ముక్కలుముక్కలై కనిపించాయ్. ఆ సీన్‌ను చూసిన రైతు రామారావు షాక్‌కి గురయ్యాడు. కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఎలుకలపాలైందంటూ ఆవేదన చెందుతున్నాడు.
వీడియో..
Also read :
- విశ్వకర్మ బీమా అమలు చేయాలి
- Andhra: జాతకం చెప్పే వేలిముద్రలు.. రైల్వేస్టేషన్లో తెల్లవారుజామున 4గంటలకు ఒక్కసారిగా అలజడి..
- సెల్ఫోన్లో గేమ్ ఆడుతున్నాడని బాలుని హత్య
- Andhra Pradesh: అలిగిన భార్య కోసం వెళ్లిన భర్త.. చుట్టుముట్టిన బంధువులు.. అయ్యో చివరకు..
- చిన్నారిపై లైంగిక దాడికి యత్నం





