April 11, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: గుంత తీసి పాతి పెట్టడానికి సిద్దమయ్యాడు.. డామిట్ ఇంతలోనే కథ అడ్డం తిరిగింది..!

తాననుకున్నది చేయగలను అన్న నమ్మకం అతనికి కలిగింది. దీంతో వెంటనే ఇద్దరూ మనుషులను పాతి పెట్టగలిగేంత గుంత తీశాడు. అనుకున్న విధంగా అక్కడికి ఆమెను తీసుకొచ్చాడు. గొంతు నులిమి చంపడానికి ఫ్లాన్ చేశాడు. ఆమె కూడా చనిపోయినట్లు పడిపోయింది. అయితే ఆమె కొడుకును తీసుకొచ్చేంత వరకూ వేచి చూసింది. అప్పుడే అసలు సినిమా చూపించింది. దీంతో అతని ప్లాన్ పోలీసులకు తెలిసిపోవడంతో పారిపోయాడు. మరోవైపు నిందితుడి కోసం వెదుకులాట ప్రారంభమయింది.

Also read :Job Fraud: భాగ్యనగరంలో ఘరానా మోసం.. రూ.24 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన జాగృతి కన్సల్టెన్సీ

పల్నాడు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన శ్రీనివాసరావు తాపీ పనులకోసం హైదరాబాద్ లోని గచ్చిబౌలికి వెళ్లాడు. అక్కడ పనిచేస్తుండగా మహబూబ్ నగర్ చెందిన శైలజ ఆమె మొదటి భర్త కుమారుడు శివతో పరిచయం అయింది. శైలజతో పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే ఆమె గర్భవతి అయింది. దీంతో ఇద్దరిలో కంగారు మొదలైంది. అయితే ముప్పాళ్ల వెళ్లి అక్కడ గర్భస్రావం చేయించుకుందామని శ్రీనివాసరావు చెప్పాడు. అతని మాటలు నిజమని నమ్మిన వారిద్దరూ అతని పాటు ముప్పాళ్ల వచ్చారు.

Also read :Watch Video: ఆమ్మవారి ఆలయంలో ఊహించని ఘటన.. షాకైన ధర్మకర్తలు, భక్తులు..

అక్కడున్న ఒక రెస్టారెంట్ వద్ద శివను దించిన శ్రీనివాసరావు ఆమెను బైక్ పై ఎక్కించుకొని అద్దంకి బ్రాంచ్ కెనాల్ వరకూ తీసుకొచ్చాడు. అక్కడ ఆమె గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆమె కింద పడిపోయి చనిపోయినట్లు నటించింది. దీంతో వెంటనే అక్కడ నుండి శ్రీనివాసరావు వెళ్లి శివను బైక్ పై ఎక్కించుకొని తిరిగి బ్రాంచ్ కెనాల్ వద్దకు తీసుకొచ్చాడు. అయితే అనుమానం వచ్చిన శివ బైక్ దూకి పారిపోయిన చెట్ల మధ్యలో దాక్కున్నాడు. ఇదంతా గమనిస్తున్న శైలజ వెంటనే లేచి సమీపంలో ఉన్న పవర్ ప్లాంట్ వద్దకు వెళ్లి రక్షించాలంటూ వేడుకొంది.

Also read :Watch Video: సర్టిఫికేట్ల కోసం వచ్చిన విద్యార్థి.. స్పృహ కోల్పోవడంతో వెలుగులోకి షాకింగ్ నిజాలు..

దీంతో స్థానికులు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం వచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది తెలుసుకున్న శ్రీనివాసరావు బైక్ వదిలి పెట్టి అక్కడ నుండి పారిపోయాడు. ఘటనా స్థలానికి దగ్గరలోనే గుంత తీసి ఉండటాన్ని పోలీసులు గమనించారు. వారిద్దరిని చంపి పూడ్చి పెట్టాలన్న ఉద్దేశంతోనే శ్రీనివాసరావు ఇదంతా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లి, కొడుకు వద్ద నుండి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు శ్రీనివాసరావు కోసం వేట మొదలు పెట్టారు పోలీసులు. శ్రీనివాసరావు నిజ స్వరూపం తెలుసుకున్న తల్లి కొడుకులిద్దరూ కన్నీరుమున్నీరుగా విలపించారు.

Also read :తెల్లారితే గృహప్రవేశం.. కలలుకన్న దంపతులు.. దర్శనమిచ్చిన కాళరాత్రి..

Related posts

Share via