విశాఖపట్నం ఏసీబీ కార్యాలయం సమీపంలో తీవ్ర కలకలం రేగింది. జీవీఎంసీ ఆదర్శనగర్ పంప్ హౌస్‌లో సడెన్‌గా కొండచిలువ ఏంట్రీ ఇచ్చింది. దాన్ని చూసిన సిబ్బంది గట్టిగా కేకలు వేస్తూ భయంతో పరుగులు తీశారు. దీంతో భయబ్రాంతులకు గురైన స్థానికులు పంప్ హౌజ్‌లో నిదానంగా కదులుతూ 12 అడుగుల భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది.
అది విశాఖలోని ఏసీబీ కార్యాలయ సమీపంలోని ఓ ప్రాంతం.. అక్కడ జీవీఎంసీ పంపు హౌస్ లో పనిచేస్తున్నాడు సురేష్. రోజు మాదిరిగానే నీటిని విడిచి పెట్టేందుకు అక్కడికి వెళ్ళాడు. పంపు హౌస్ లోని వాల్ ఓపెన్ చేసేందుకు లోపలికి దిగే ప్రయత్నం చేశాడు. లోపలికి వెళ్ళాడు. వెంటనే హార్ట్ బీట్ హై చేరింది. ఎందుకంటే అక్కడ ఓ భారీ కొండచిలువ కనిపించింది. పైకి వచ్చి పారిపోయే ప్రయత్నం చేసి.. పడిపోయాడు నరేష్. గుండెలు అరచేతిల్లో పట్టుకుని పరిగెత్తాడు.. కేకలు పెట్టి అరిచాడు.
విశాఖలో 12 అడుగుల కొండచిలువ కలకలం సృష్టించింది. జీవీఎంసీ జోన్`2, 9వ వార్డు ఎండాడ`ఆదర్శనగర్ ప్రాంతంలో ఓ పంప్ హౌస్ ఉంది. పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేసేందుకు అక్కడి ఇన్‌స్పెక్టర్ నరేష్ సిద్ధమయ్యాడు. వాల్ దగ్గరకి దిగాడు.. అక్కడ 12 అడుగుల కొండచిలువ కనిపించడంతో బెంబేలెత్తిపోయాడు. ఆ తర్వాత పరుగులు పెట్టాడు. తేరుకునేలోపే కంగారుతో కిందపడ్డాడు. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమై విషయాన్ని తెలుసుకున్నారు. నరేష్‌ను పైకి లేపి.. కొండచిలువ సమాచారాన్ని పాములు పట్టే స్నేక్ కేచర్ కిరణ్‌కు సమాచారమిచ్చారు. కిరణ్ అక్కడకు చేరుకుని పామును అత్యంత చాకచక్యంగా పట్టుకున్నాడు. ఒకానొక సమయంలో కిరణ్ ను కూడా శరీరమంతా చుట్టేసింది ఆ కొండచిలువ. అది కష్టం మీద కొండచిలువను అదుపులోకి తీసుకొని పైకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ కొండచిలువను అడవిలో వదిలేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!