June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

విజయనగరం : మరో బాలుడిని బలి తీసుకున్నఆన్ లైన్ గేమ్.. దారుణంగా హతమార్చిన స్నేహితులు.. తోటలోకి తీసుకెళ్లి?

చైతన్య అనే మైనర్ బాలుడు, మరో ఇద్దరు మైనర్లు మంచి స్నేహితులు. ముగ్గురు కలిసిమెలిసి ఉంటారు. ఎక్కడికి వెళ్లినా, ఏమి చేసినా ముగ్గురు కలిసే చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల మొబైల్స్ ద్వారా ఆన్ లైన్ గేమ్స్ ఆడుతుంటారు

విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆన్ లైన్ గేమ్ లో నెలకొన్న వివాదం చినికిచినికి హత్యకు దారితీసింది. నెల్లిమర్ల మండలం కొండపేటలో చైతన్య అనే మైనర్ బాలుడు, మరో ఇద్దరు మైనర్లు మంచి స్నేహితులు. ముగ్గురు కలిసిమెలిసి ఉంటారు. ఎక్కడికి వెళ్లినా, ఏమి చేసినా ముగ్గురు కలిసే చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల మొబైల్స్ ద్వారా ఆన్ లైన్ గేమ్స్ ఆడుతుంటారు. ప్రస్తుతం స్కూల్స్ కి సెలవులు కావడంతో ఎక్కువ సమయం ఆన్ లైన్ గేమ్స్ లోనే గడిపేవారు. అయితే ఈ ముగ్గురిలో చైతన్య అనే బాలుడు ఎక్కువసార్లు గేమ్ లో గెలుస్తుండేవాడు. అలా గెలిచిన చైతన్య తన తోటి స్నేహితులను మీరు ఓడిపోయారని ఎగతాళి చేస్తుండేవాడు. అలా అనేకసార్లు వారి ముగ్గురు మధ్య వివాదం నెలకొంది. ఆ వివాదం దుర్భాషలు, కవ్వింపుల వరకు వెళ్లింది. దీంతో చైతన్య మీద మిగతా ఇద్దరు స్నేహితులు కోపం, పగ పెంచుకున్నారు. చైతన్యను ఎలా అయినా కసితీరా కొట్టి చంపాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం సినీఫక్కీలో లో ప్లాన్ చేశారు. చైతన్య ను ఎక్కడ చంపాలి? ఎలా చంపాలి? తరువాత ఎలా తప్పించుకోవాలి? అని ప్లాన్ చేసుకున్నారు. ఉదయం తన తల్లితో బ్యాంక్ కు వెళ్లిన చైతన్య ను మధ్యాహ్నం సమయంలో అనుకున్నట్టే నమ్మకంగా కలిశారు. సరదాగా బయటకు వెళ్దామని తీసుకెళ్లారు. అక్కడ నుండి తాటిముంజలకు తోటలోకి వెళ్దామని నమ్మించారు. తన పై కుట్ర జరుగుతోందని తెలియని చైతన్య వారు చెప్పినట్లు వారితో వెళ్లాడు. అలా ఇద్దరు స్నేహితులు చెప్పినట్లు తాటిముంజల తోటలోకి వెళ్లాడు చైతన్య. ఇక అక్కడ హత్యకు సిద్ధమయ్యారు. చైతన్యను అక్కడ ఉన్న ఒక బండరాయితో వెనుక నుంచి తల పై బలంగా మోదాడు. దీంతో చైతన్య అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు

అలా పడిపోయిన చైతన్యను మళ్ళీ మళ్ళీ కొట్టి హతమార్చారు. చైతన్య చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత మృతదేహాన్ని ప్రక్కనే ఉన్న తుప్పల్లోకి లాక్కెళ్లి ఎవరికి కనిపించకుండా వదిలేసి ఇంటికి వెళ్ళిపోయారు. తిరిగి ఇంటికి వెళ్లిన ఇద్దరు స్నేహితులు తమకు ఏమి తెలియనట్లు నటించడం సాగించారు. అయితే ఇంటి నుండి స్నేహితులతో బయటకు వెళ్లిన చైతన్య ఎంతకీ తిరిగి రాకపోవడంతో గ్రామ శివారు ప్రాంతాలన్నీ వెదికి కనిపించకపోయేసరికి పోలీసులను ఆశ్రయించింది చైతన్య తల్లి. కేసు నమోదు చేసి రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చైతన్య యొక్క ఇద్దరు స్నేహితుల్ని విచారించారు. అయితే అక్కడ కూడా ఇద్దరు నిందితులు పోలీసులను తప్పుద్రోవ పట్టిస్తూ మృతదేహం ఉన్న వైపు కాకుండా ఇతర ప్రాంతాల వైపు చైతన్య వెళ్లినట్లు పోలీసులకు సమాచారం ఇస్తూ వచ్చారు. చివరికి పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా జరిగిందంతా చెప్పేశారు. దీంతో ఇద్దరు జువైనల్స్ కటకటాల పాలయ్యారు. అయితే చైతన్య తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో చైతన్య తల్లి చైతన్య మీదే ఆశలు పెట్టుకొని జీవిస్తుంది. ఇప్పుడు చైతన్య మృతితో అటు తల్లితో కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.

Related posts

Share via