July 3, 2024
SGSTV NEWS
Andhra Pradesh

ఊళ్లోకి చొరబడ్డ ఎలుగుబంటి.. 8 గంటలు భీభత్సం, సీన్ కట్ చేస్తే!

ఊళ్లోకి చొరబడ్డ ఎలుగుబంటి 8 గంటల పాటు జనాన్ని హడలెత్తించింది. అటవీ అధికారులు, పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. శ్రీకాకుళo జిల్లా.. వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలో ఎలుగుబంటి చొరబడింది. తెల్లవారుజామున ఊళ్లోకి వచ్చిన ఎలుగు ఊరు మధ్యలోని ఓ పాడుబడిన ఇంట్లో తిష్ట వేసింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇటీవల ఇదే మండలంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఇక ఎలుగుబంటి ఏకంగా ఊరి మధ్యలోనే తిష్ట వేయడంతో గ్రామస్తులు భయంతో వణికిపోయారు.

గత 12గంటలకు పైగా పాడుబడిన ఇంట్లోనే తిష్ట వేసింది ఎలుగుబంటి. నీరు, ఆహారం లేక అది నీరసించి పోయింది. ఊళ్లోకి ఎలుగుబంటి చొరబడ్డ విషయాన్ని తెలుసుకున్న DFO, విశాఖ జూ అధికారులు, పోలీసులు.. హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. ఎలుగుబంటిని ఇంటి నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. దాన్ని బంధించేందుకు ఆపరేషన్‌ బంటి ప్రారంభించారు. గ్రామస్తులను ఘటనా స్థలం నుంచి ఇళ్లలోకి వెళ్లిపోవాలని సూచించారు. బంటిని సురక్షితంగా బంధించి విశాఖ జూకు తరలించే ప్రయత్నం ఉదయం నుంచి చేశారు

రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఇంటి ముఖ ద్వారం దగ్గర బోనును ఏర్పాటు చేసి బంటిని బంధించేందుకు యత్నించారు. ఇంట్లోని చివరి గదిలో తిష్ట వేసి ఉన్న ఎలుగును బోనులోకి జీడి పళ్లు, తేనెను ఎరగా వేశారు అధికారులు. ఏడాది కిందట ఇదే మండలం కిడిసింగిలో ఆపరేషన్ బంటి ద్వారా గ్రామంలో తిష్టవేసిన ఎలుగును బంధించారు అధికారులు. అయితే విశాఖ జూకి తరలించే క్రమంలో ఆ ఎలుగుబంటి మృతి చెందింది. ఈ నేపథ్యంలో మత్తుమందు ఇవ్వకుండానే రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించారు

Also read

Related posts

Share via