April 18, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: అయ్యో దేవుడా.. చిన్నారిని బలిగొన్న షకలక బూంబూం ఆట.. ఆ రోజున ఏం జరిగిందంటే..

 

కృష్ణా జిల్లాకు చెందిన ఆరేళ్ల చిన్నారి షకలక బూంబూం ఆట ఆడి తన ప్రాణాలను కోల్పోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వారాల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తుది శ్వాస విడిచింది.. అందరూ న్యూ ఇయర్ వేడుకల చేసుకుంటుంటుంటే ఈ చిన్నారి సరదాగా స్నేహితులతో కలిసి షకలక బూంబూం.. ఆట ఆడింది. అభం శుభం తెలియని ఆ చిన్నారికి..

ఎప్పుడో పాత రోజుల్లో ఈ ఆట బాగా ఫేమస్.. చిన్నా, పెద్ద అందరూ కూడా షకలక బూంబూం ఆటను తెగ ఆడేసేవాళ్ళు.. ఇప్పటికీ పల్లెటూర్లలో చాలాచోట్ల షకలక బూంబూం.. లాంటి ఆటలను ఆడుతూనే ఉంటారు.. అలాంటి షకలక బూంబూం ఆట తాజాగా.. ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది.. వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ఆరేళ్ల చిన్నారి షకలక బూంబూం ఆట ఆడి తన ప్రాణాలను కోల్పోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వారాల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తుది శ్వాస విడిచింది.. అందరూ న్యూ ఇయర్ వేడుకల చేసుకుంటుంటుంటే ఈ చిన్నారి సరదాగా స్నేహితులతో కలిసి షకలక బూంబూం.. ఆట ఆడింది. అభం శుభం తెలియని ఆ చిన్నారికి ఈ ఆటే తన ప్రాణాలు తీస్తుందని తెలియక మంటల్లో తీవ్ర గాయాల పాలయ్యింది..

అగ్గిపుల్లలను ఒకచోట పేర్చి మధ్యలో కొవ్వొత్తి ఉంచి మంట వెలిగించడంతో ఒక్కసారిగా భారీగా చెలరేగిన మంట చిన్నారికి అంటుకుంది.. దగ్గరగా ఉండి ఆ ఆటను చూస్తున్న చిన్నారికి మంటలు అంటుకోవడంతో ఒళ్లంతా కాలి.. తీవ్ర గాయాలయ్యాయి. దాంతో తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడే కొన్ని రోజులు వైద్యం తీసుకున్న తర్వాత పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండడంతో అక్కడి నుంచి వెంటనే మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు..

అక్కడ కూడా ప్రయోజనం లేకుండా పోయింది.. దాదాపు 27 రోజులకు పైగా వైద్యులు ఆ చిన్నారిని బ్రతికించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.. కానీ ఒళ్లంతా ఎక్కువగా కాలిన గాయాలు కావడంతో ఇన్ఫెక్షన్స్ పెరిగి.. వైద్యం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖరికి చిన్నారి తన ప్రాణాలు విడిచింది..

ఒక్కగానొక్క కూతురు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆటలతో పాటలతో చలాకీగా ఉండే చిన్నారి న్యూఇయర్ వేళ ఆడుతూ.. ఇలా మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది

Also read

Related posts

Share via