బతుకుదెరువు కోసం ఆర్మేనియాకు వెళ్లిన ప్రకాశం జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. కుమారుడి మృతదేహం కోసం వెళ్తే రూ.2 లక్షలు ఇస్తేనే డెడ్‌బాడీనీ చూపిస్తామని అంటున్నారని మృతుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దారుణ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని హసానాబాద్‌కు చెందిన..
పెద్దదోర్నాల, ఆగస్టు 14: బతుకుదెరువు కోసం ఆర్మేనియాకు వెళ్లిన ప్రకాశం జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. కుమారుడి మృతదేహం కోసం వెళ్తే రూ.2 లక్షలు ఇస్తేనే డెడ్‌బాడీనీ చూపిస్తామని కుమారుడి స్నేహితులు అంటున్నారని మృతుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దారుణ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని హసానాబాద్‌కు చెందిన చిన్న ఆవులయ్య, రాజేశ్వరి దంపతుల కుమారుడైన ఒంటేరు శివనారాయణ (31) బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్‌వేర్‌గా ఉద్యోగం చేస్తుండేవాడు. యూరప్‌లోని ఆర్మేనియాలో ఉద్యోగం రావడంతో 7 నెలల క్రితం అక్కడ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరాడు. అక్కడ పరిచయమైన ఇద్దరు స్నేహితులతో కలిసి ఉంటున్నట్లు15 రోజుల క్రితం తల్లిదండ్రులకు తెలిపాడు.
ఈ నేపథ్యంలో స్నేహితులతో కలిసి ఆగస్టు 8వ తేదీన ఓ పార్టీకి వెళ్లాడు. పార్టీలో మిత్రులు తనకు ఓ బాటిల్లో నీరు ఇచ్చారని, అది తాగటం వల్ల వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తల్లిదండ్రులకు ఫోన్‌లో తెలిపాడు. తాను ఆసుపత్రిలో చేరానని, అక్కడ చికిత్స తీసుకుంటున్నట్లు తండ్రి చిన్న ఆవులయ్యకు ఫోన్‌లో తెలిపాడు. ఈ క్రమంలో శనివారం తల్లిదండ్రులకు వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఫొటోలు, వీడియోలను అతడి స్నేహితులు పంపించారు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ అదే రోజు శివనారాయణ చనిపోయాడంటూ అతడి స్నేహితులు సమాచారం అందించారు. దీంతో మృతుడి తల్లిదండ్రులు ఒక్కసారిగా బావురుమన్నారు.
చనిపోయిన తమ కుమారుడిని చూపించాలని చిన్న ఆవులయ్య కోరగా.. రూ.2 లక్షల పంపితే వీడియో కాల్ ద్వారా మృతదేహాన్ని చూపిస్తాం, రూ.10 లక్షలు పంపితే మృతదేహాన్ని ఇండియాకు తీసుకొస్తామని శివనారాయణ స్నేహితులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఈ సమాచారం ఇచ్చినప్పటి నుంచి వారి సెల్‌ఫోన్లు కూడా స్విచ్చాఫ్ కావడంతో ఏం చేయాలో అర్ధంకాక దిక్కతోచని స్థితిలో మృతుడి తల్లిదండ్రులు విలపిస్తున్నారు. అంతేకాకుండా శివనారాయణ అకౌంట్‌లో ఉన్న రూ. 10 లక్షలు కూడా స్నేహితులు డ్రా చేసుకున్నట్లు ఆయన ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ కుమారుడి మృతదేహాన్ని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
Also read
- ‘నేను చచ్చిపోయినా బాగుండేది’.. అమీన్పూర్ ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!
- హెల్త్ సూపర్వైజర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సుపారీ ఇచ్చి మరీ భార్య దారుణంగా!
- Lady Aghori-Sri Varshini: అఘోరీ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. వర్షిణిని రప్పా రప్పా ఈడ్చుకెళ్లిన ఫ్యామిలీ
- ప్రయాణిస్తున్న రైలు వాష్‌రూమ్‌లో వేధింపులు.. వీడియోలు రికార్డింగ్
- ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో