అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. ఘటనా స్థలంలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసి నిండితుడు సురేష్ పారిపోయాడు. అనకాపల్లి రాంబిల్లి మండలం కొప్పు గుండు పాలెంలో ఘటన జరిగింది. గతంలో ఇదే బాలికను వేధింపుల కేసులో జైలుకు వెళ్లొచ్చాడని చెబుతున్నారు బంధువులు..
Also read :Hyderabad: చిందేస్తూ గుప్పున గుంజారు.. పోలీసుల ఎంట్రీతో ఉరుకులు పరుగులు.. కట్ చేస్తే..
అనకాపల్లి జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బాలికపై ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేసాడు. ఘటనా స్థలంలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసి నిండితుడు సురేష్ పారిపోయాడు. ఈ ఘటన అనకాపల్లి రాంబిల్లి మండలం కొప్పు గుండు పాలెం లో ఘటన జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక.. రాంబిల్లి మండలం కొప్పు గుండు పాలెంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటుంది. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లిపోయారు. నానమ్మ మరో ఇంట్లో ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చిన బాలిక.. నానమ్మ ఇంటికి వెళ్లి అక్కడ తాళాలు తీసుకుని… తన ఇంటికి వెళ్ళింది. కాసేపటికి నానమ్మ కాంతం కూడా మనమరాలు వెళ్లిన ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో ఇంటి తలుపులు వేసి ఉండడాన్ని గమనించింది నానమ్మ. కాసేపు వేచి చూసి.. తలుపు తట్టింది. ఎంతకీ తీయకపోయేసరికి… కాస్త గట్టిగా అరిచింది. దీంతో తలుపులు తీసిన నిండితుడు.. బాలిక నాన్నమ్మ కాంతంను తోసి పారిపోయాడు. లోపలకు వెళ్లి చూసేసరికి ఆ రక్తపు మడుగులో పడి ఉంది ఆ బాలిక. ఘటన స్థలంలోనే ప్రణాలు కోల్పోయింది. గత కొంతకాలంగా వెంటపడుతున్న సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నానమ్మ పోలీసులకు చెప్పింది.
Also read :Telangana: అంతా కలిసి చనిపోయేలా చేశారు.. ఎస్ఐ శ్రీనివాస్ మృతి కేసులో సంచలన విషయాలు..Viral: జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ వింత వస్తువు.. వెలికితీసి చూడగా స్టన్
సమగ్ర విచారణకు హోం మంత్రి ఆదేశం..
ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు హోం మంత్రి. సమగ్ర విచారణకు ఆదేశించారు. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. నిందితుడు కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి
Also read :Gupta Navratri: గుప్త నవరాత్రి పూజ శుభ సమయం, కలశాన్ని ఏర్పాటు చేయడానికి నియమాలు ఏమిటంటే