February 23, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Chittoor District: సడెన్‌గా స్పృహ తప్పి పడిపోయిన 10వ తరగతి బాలిక.. ఆస్పత్రికి తీసుకెళ్లగా..



చిత్తూరు జిల్లాలో టెన్త్ విద్యార్థిని ప్రసవం ఘటన సంచలనంగా మారింది. డెలివరీ టైమ్‌లో ఫిట్స్‌తో రావడంతో బాలిక మృతిచెందింది. ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. బాలికను ఏమార్చి గర్భవతిని చేసింది ఎవరో కనిపెట్టి.. కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పలమనేరు మండలం టి ఒడ్డూరుకు చెందిన  10వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక స్పృహ తప్పి పడిపోవడంతో బంగారుపాలెం ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. బాలిక గర్భవతిగా గుర్తించి డెలివరీకి ప్రయత్నం చేశారు అక్కడి వైద్య సిబ్బంది. డెలివరీ టైమ్‌లో ఫిట్స్ రావడంతో బాలికను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మైనర్ బాలికకు ఆపరేషన్ చేసి బిడ్డను రక్షించే ప్రయత్నం చేశారు అక్కడి వైద్యులు. అయితే బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి మెటర్నటీ ఆసుపత్రికి తరలించారు. ప్రసవం తరువాత విద్యార్థిని మృతి చెందింది. బిడ్డ పరిస్థితి విషమంగా ఉండటంతో… అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. టెన్త్ విద్యార్థిని ప్రసవం, మృతి ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.  ఫోక్సో కేసు నమోదు చేసిన పలమనేరు పోలీసులు.. దర్యాప్తు సాగిస్తున్నారు. మైనర్ బాలిక గర్భవతికి కారణం ఎవరో తెలుసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Also read

Related posts

Share via