ఇది ఎమ్మెల్యే అనుచరుల పనే: బాధితుడు
అనంతపురం;: అనంతపురంలోని సర్వీసు రోడ్డులో ఉన్న నంబూరి వైన్స్ దుకాణానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు పెట్రోలు డబ్బాలతో దుకాణం వద్దకొచ్చి, గోనె సంచులను పెట్రోలుతో తడిపి షటర్ కింది నుంచి లోనికి వేసి నిప్పు పెట్టినట్లు సీసీ కెమెరా ఫుటేజీల్లో రికార్డయింది. ఈ ఘటనలో దుకాణంలోని సరకంతా దహనమైంది. ఫ్రిజ్, అందులోని ఖరీదైన మద్యమూ కాలిపోయింది. రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వెంకటరమణ తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అనుచరులే నిప్పుపెట్టారని ఆరోపించారు. మద్యం టెండర్ల సమయంలోనూ షాపు వదిలిపెట్టాలని ఎమ్మెల్యే తన అనుచరుడు గంగారాం ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్పందించి ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. మరోపక్క, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ఎమ్మెల్యే అనుచరుడు మోహనన్ను మంగళవారం రాత్రి అరెస్టు చేశారు.
కావాలనే దుష్ప్రచారం: ఎమ్మెల్యే
ఘటనతో నాకెలాంటి సంబంధం లేదు. నేను సోమవారమే హైదరాబాద్ వెళ్లా. కొందరు కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. అన్ని విషయాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తా’ అని ఎమ్మెల్యే వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు.
Also read
- మేడ్చల్ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!
- చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఏంటిదీ.. గలీజ్ పని చేస్తూ దొరికి డిగ్రీ ఫస్టియర్ స్టూడెంట్!
- చదువుకోవడానికి వచ్చి తనువు చాలించిన అనాథ బాలిక.. బాలసదన్‌లో బాలిక మృతికి కారకులెవరు..?
- చూసి అమాయకుడు అనుకునేరు.. ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- ఘోరం.. వృద్ధురాలిని పీక్కుతిన్న పెంపుడు పిల్లులు..





