విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాంలో యువతిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఇంటి ముందు బట్టలు ఉతుకుతుండగా.. మాస్క్ ధరించి వచ్చి కత్తితో పొడిచి పరారయ్యాడు. యువతికి పొట్టలో బలంగా కత్తిపోట్లు దిగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
AP Crime: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన యువతి శనివారం ఇంటి ముందు దుస్తులు ఉతుకుతుండగా.. ఒక్కసారి ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో తెలియదు కానీ.. మాస్క్ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి వచ్చి కత్తితో పొడిచి పరారయ్యాడు. యువతికి పొట్టలో బలంగా కత్తిపోట్లు దిగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
కత్తితో పొడిచి పరార్..
వెంటనే చుట్టు పక్కల వారు గమనించి 108కి ఫోన్ చేశారు. ఆమెను చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఆస్పత్రికి తరలించారు. కత్తితో పొడిచి పరారైన వ్యక్తి కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చిన వ్యక్తి ఎవరు.. ఆమెకు ఆ వ్యక్తికి ఏమైనా ప్రేమ వ్యవహారం ఉందా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read
- మహిమగల చెంబు ఉందంటూ వైద్యురాలి నుండి రూ.1.50 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
- ఆ తల్లికి ఎంత కష్టమొచ్చింది.. మృతదేహంతో స్మశానంలో జాగారం..!
- Hyderabad: సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నం
- Andhra: చవితి వేళ పాలు పోసేందుకు పుట్ట వద్దకు భక్తులు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్..
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?




