June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

ప్రేమ అంటూ పెడదోవ పడుతున్న అమ్మాయల మధ్య.. ఓ చదువుల తల్లి విషాద గాథ!

అక్షయ.. ఓ కాలేజీలో నర్సింగ్ చదువుతుంది. ఇటీవల సెకండియర్ పరీక్షలు రాసి.. వేసవి సెలవులు నిమిత్తం ఇంటికి వచ్చింది. సెలవులు ముగిశాక కాలేజీకి వెళ్లాల్సి ఉండగా.. తండ్రి పంపించలేదు. కానీ చివరకు ఆమె

సరస్వతి ఉన్న చోట ధనలక్ష్మీ ఉండదట అని సరదాగా పెద్దలు అంటుంటారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. కొన్ని సంఘటనలు చూస్తుంటే నిజం అనిపించమానదు. బాగా చదువుకుంటున్న పిల్లలు.. చదువును కొనలేక పని బాట పడుతున్నారు. చిన్న వయస్సులోనే కుటుంబ భారాన్ని మోస్తున్నారు. పది, ఇంటర్‌లో మంచి మార్కులతో పాసైన విద్యార్థి, విద్యార్థునులు.. పై చదువులు చదివించేందుకు తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ.. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు చిన్న చిన్న పనులకు వెళుతుంటారు. మరి కొందరు ఫీజులు కట్టలేక చదువులు మధ్యలోనే వదిలేస్తుంటారు. ఉన్నత చదువులు చదివి.. ఫ్యామిలీకి ఆసరాగా, అండగా నిలబడదామనుకుంటున్న పిల్లల విషయంలో ఆర్థిక సమస్యలు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి.

అక్షయ విషయంలో కూడా అదే జరిగింది. నర్సింగ్ కాలేజీ విద్యార్థిని అయిన అక్షయ తండ్రి కాలేజీ ఫీజు కట్టలేదు. తన వద్ద డబ్బులు లేవని, ఆమెను ఇంట్లోనే ఉంచేశాడు. చదువు మధ్యలోనే ఆగిపోతుందన్న వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది యువతి. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని సంతోష్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సింగరేణిలో ప్రైవేట్‌ ఓల్వో డ్రైవర్‌గా పనిచేస్తున్న బానోత్‌ రాజేశం- అమృతలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు అక్షయ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీలో సెకండియర్‌ చదువుతోంది. ఇటీవల పరీక్షలు ముగిశాక.. వేసవి సెలవులు రావడంతో ఇంటికి వచ్చింది. సెలవులు ముగిసిన తర్వాత.. కాలేజీకి వెళ్లాలని చెప్పింది. అదేవిధంగా ఫీజు కట్టాలంటూ తండ్రి రాజేశానికి తెలిపింది

కాగా, తనకు ఇంకా వేతనం రాలేదని, వచ్చిన తర్వాత ఫీజు కడతానని, అప్పటి వరకు కాలేజీకి వెళ్లొద్దంటూ తండ్రి కాస్తంత కటువుగా చెప్పాడు. దీంతో నను కాలేజీకి పంపరేమో, ఇక ఇంట్లోనే ఉంచేస్తారేమోనని పిచ్చి ఆలోచన చేసింది అక్షయ. ఈ విషయం పదే పదే ఆలోచన చేసిన ఆమె.. గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంతకు కూతురు బయటకు రాకపోవడంతో తలుపులు కొట్టారు. అయినా తీయకపోవడంతో.. తలుపులు పగుల కొట్టి చూడగా.. ఫ్యానుకు వేళాడుతూ కనిపించింది. అక్షయను ఇలా చూసే సరికి తల్లిదండ్రులు, అక్కా, తమ్ముడు కన్నీటి పర్యంతం అయ్యారు. ఫీజు కడతాను అన్నానని, డబ్బులు కట్టేంత వరకు ఆగాలని చెప్పానని, దీంతో ఆత్మహత్య చేసుకుందని తండ్రి బోరున విలపించారు. అక్షయ సోదరి అనిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రేమ అంటూ పెడదోవ పడుతున్న అమ్మాయిలున్న ఈ రోజుల్లో.. చదువు కోసం ఆత్మహత్య చేసుకుంది అక్షయ.

Also read :ఆ సంబంధం మోజులో ప్రియుడితో కలిసి తప్పుచేసింది.. ఇప్పుడు ఒంటరిగా ఉంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్న నటి..

Twin Daughters: పుట్టిన 2 రోజులకే కవల కూతుళ్లను చంపిన తండ్రి! ఎందుకో తెలిస్తే రక్తం మరుగుద్ది..

కళ్లలో కారం జల్లి, జేసీబీతో.. ఘట్కేసర్ కేసులో విస్తుపోయే విషయాలు

Viral News: కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడటమంటే ఇదే.. ‘చెల్లితో భర్త జంప్‌! భర్త తండ్రితో తల్లి జంప్‌’

Related posts

Share via