April 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

అమ్మానాన్నను వీడి అనంతలోకాలకు..

నంద్యాల: బుడిబుడి నడకలతో.. వచ్చీ రాని మాటలతో…  ముసిముసి నవ్వులతో అందరినీ మెప్పించే ఆ చిన్నారి ఇక లేరు. ఎప్పుడూ అమ్మానాన్న వెంటే ఉండే ఆ బాలిక ఈ లోకాన్ని వీడి వెళ్లి పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తూ ఇంటి మిద్దైపె నుంచి పడి మృత్యువాత పడింది. ఈ దుర్ఘటన కోసిగి మండలం వందగల్లు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..

గ్రామానికి చెందిన లంకా ఆంజనేయులు, నాగలక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్రీదేవికి మూడేళ్లు ఉండగా.. చిన్న కుమార్తె ఏడాది వయస్సులో ఉన్నారు. ఆదివారం తల్లిదండ్రులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా పెద్ద కుమార్తె శ్రీదేవి (3) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉంది.

ఆటల్లోనే మెల్లగా మెట్లు ఎక్కి మిద్దె పైకి వెళ్లింది. అదే సమయంలో ట్రాక్టర్ శబ్దం రావడంతో తండ్రి వెళ్తున్నాడని భావించి మిద్దైపె నుంచి తొంగి చూస్తూ కింద పడిపోయింది. తలకు తీవ్రమైన రక్త గాయం కావడంతో బైక్పై కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లెదుట కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Also read

Related posts

Share via