November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024

అంబేద్కర్ విదేశీ విద్య అంతా మిద్యే
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ



పెనుగొండ
చంద్రబాబు హయాంలో 4,000 మందికి పైగా విద్యార్థులకు అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా విదేశాల్లో చదువుకునే అవకాశాలు కల్పించగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఐదేళ్లలో ఏ ఒక్కరికి విదేశీ విద్య అందించకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు చంద్రబాబు మూడు సమ్మెట్ ద్వారా 5లక్షల 13వేల ఉద్యోగాలు కల్పించి కీలకపాత్ర పోషించారని అన్నారు జగన్ రెడ్డి బొక్క బిజినెస్ సమ్మెట్ ద్వారా 9150 ఉద్యోగాలు ఇవ్వగలిగారని ఆక్షేపించారు డ్వాక్రా మహిళలకు ఐదు లక్షల వడ్డీ లేని రుణాలు చంద్రబాబు ఇస్తే జగన్ రెడ్డి 3 లక్షలకు ఈ రుణాలు కుదించారని మండిపడ్డారు ఎస్సీ బీసీ కార్పొరేషన్ రుణాలు నాలుగు లక్షల వరకు గత ప్రభుత్వంలో అందించగా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ లోన్లు ఇవ్వకుండా పూర్తిగా ఆపేశారని ఆ నిధులను సంక్షేమ పథకాలకు మళ్ళించడం దుర్మార్గం అని అన్నారు అవినీతి అరాచక విధ్వంస పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మాయ చేసి భయపెట్టి బెదిరింపులకు పాల్పడి పాలన సాగించారని పాలన లో అభివృద్ధి శూన్యం అని అన్నారు. నకిలీ మద్యాన్ని ప్రజలకు విక్రయించి 30 వేల ప్రాణాలను బలిగొన్న ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అని మద్యపాన నిషేధం తోనే మళ్లీ ఎన్నికల్లో ఓటు అడిగేందుకు ప్రజల ముందుకు వస్తానని చెప్పిన జగన్ రెడ్డి మాట ఇచ్చి మడం తిప్పరని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టివేసి రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు తరలించి తన ఖాతాలో జమ చేసుకున్నారని మండిపడ్డారు. ఇటువంటి అవినీతి అరాచక పాలన సాగించే ముఖ్య మంత్రి అవసరమా అంటూ మండిపడ్డారు చంద్ర బాబు నరేంద్ర మోడీలతో దేశం రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావితరాలకు బంగారు భవిష్యత్ కావాలంటే చంద్రబాబు నరేంద్ర మోడీ సర్కారుకు అభ్యర్థించారు. డబల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధికి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ వేగంగా సాగుతుందని నరసాపురం పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా మలుసుకుందని ఇచ్చిన సొమ్ము లూటీ చేసి దోచు ఉన్నారని ఆక్షేపించారు. నరేంద్ర మోడీ సమర్థవంతమైన పాలన అందిస్తూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు ఎన్డీఏ కూటమికి 400 పైన పార్లమెంటు స్థానాలు గెలుపు సాధించే దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ను రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని అధికారాన్ని రప్పించేందుకు కంకణ బద్ధులై ఉన్నారని అన్నారు.

Also read

Related posts

Share via