అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో గిరిజన బాలికల హాస్టల్‌లో ఉరేసుకుని విద్యార్థిని బలవన్మరణంకు పాల్పడింది. అశ్విని చనిపోయే ముందు రెండు అక్షరాలతో చివరి మాట డోరి నాగసూర్య, అక్క, చెల్లిలను జాగ్రత్తగా చూసుకో అంటూ కన్నీటి పర్యాంతంగా సూసైడ్ నోట్ రాసింది.
AP Crime: అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో విషాదం చోటుచేసుకుంది. గిరిజన బాలికల హాస్టల్‌లో ఉరేసుకుని విద్యార్థిని బలవన్మరణంకు పాల్పడింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం వాడపల్లి చెందిన డోరి నాగసూర్య కూతురు డోరి అశ్విని. గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్‌లో 6వ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి సమయంలో విద్యార్థులందరూ వసతి గృహంలో కలిసి భోజనం చేసింది. అర్థరాత్రి సమయంలో ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఉదయం లేచి చూసే వరకు హాస్టల్ గదిలోఅశ్విని ఉరేసుకుంది.
బాధలు పరించలేక..
అశ్విని మృతి విషయం గమనించిన విద్యార్థులు.. విషయాన్ని హాస్టల్ సిబ్బందికి చెప్పారు. వెంటనే వార్డెన్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతి చెందిన విద్యార్థిని డోరి అశ్వినిగా పోలీసులు గుర్తించారు. అశ్విని చనిపోయే ముందు ఎందుకు చనిపోతానని కారణాలతో.. సూసైడ్ నోట్‌ను రాసి చనిపోయింది. సూసైడ్ నోట్‌లో రెడ్ అక్షరాలతో చివరి మాట డోరి నాగసూర్య, అక్క, చెల్లిలను జాగ్రత్తగా చూసుకో అంటూ కన్నీటి పర్యాంతంగా సూసైడ్ నోట్ రాసింది
విద్యార్థిని వాడపల్లిలోనే కొత్త వీధికి చెందిన బాలికగా స్థానికులు వెల్లడిచారు. మృతదేహాన్ని పోర్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆస్పత్రికి చేరుకున్నారు. డాక్టర్లని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మహిళా దినోత్సవం రోజున గిరిజన బాలికల హాస్టల్‌లో బాలిక మృతితో వాడపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




