ఇప్పటికీ హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా చెబుతున్నారంటే అందుకు కారణం ఆదిశంకరాచార్యుల వారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని శివుడు కళా సేవా స్రవంతి గౌరవసలహాదారు, ఆర్మీ ఆఫీసర్ సుబేదార్ తోలేటి సుధీర్ కుమార్ (రిటైర్డ్) అన్నారు.ఆదివారం వనంపల్లి బ్రాహ్మణ రామాలయంలో శివుడు కళా సేవా స్రవంతి ఆధ్వర్యంలో ఆది శంకర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ప్రముఖ పురోహితులు బ్రహ్మశ్రీ జోశ్యుల వెంకట్రామ్ నేతృత్వంలో సుధీర్ కుమార్ , లావణ్య దంపతులు ఆదిశంకరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా జోశ్యుల వెంకట్రామ్ మాట్లాడుతూ పన్నెండేండ్లకే ఆదిశంకరాచార్యుల వారు చేసిన మహత్‌కార్యాలను, దేశం నలుమూలలా స్ధాపించిన పీఠాల వివరాలను, 16 ఏండ్లకు శంకరాచార్యులవారు అభ్యసించిన చతుర్వేద పారాయణాన్ని కండ్లకు కట్టినట్లు వివరించారు.
శంకరాచార్యుల వారి జననం, బాల్యం, విద్యాభ్యాసం, సన్యాస స్వీకారం, భక్తితత్వం, గ్రంధ రచన, దార్శనికతను సుభేదార్ తోలేటి సుధీర్ కుమార్ వివరించారు.భక్తులకు ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో తోలేటి వెంకట సీతారామరాజు, రఘు , టి.సత్య సూర్య నారాయణ, సావిత్రి , దివ్యాన్ష్ , గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు
Also read
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- నారాయణపేటలో కలకలం.. ఒక్కెసారి 100 మంది విద్యార్థులకు ఏమైంది
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!