June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

గంజాయి అలవాటు చేసి మరీ గ్యాంగ్ రేప్

మేడ్చల్, : నగరంలో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కాచిగూడకు చెందిన మైనర్కు సదరు యువకులు గంజాయి అలవాటు చేశారు. ఆ మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాలిక భయంతో ఈ ఘోరాన్ని ఎవరికీ చెప్పడకుండా ఉండిపోయింది. ఈలోపు శరీరంలో మార్పులు రావడంతో బాధితురాలిని, తల్లి నిలదీసింది. దీంతో జరిగిన ఘోరాన్ని బాలిక తల్లికి వివరించింది.

బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కాచిగూడ పోలీసులు.. ఆ కేసును నేరెడ్మెట కు బదిలీ చేశారు. పరారీలో ఉన్న యువకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Also read :ప్రొద్దుటూరులో యువకుడి దారుణ హత్య

Related posts

Share via