హైదరాబాద్ లో హోలీ రోజు దారుణం జరిగింది. సైదాబాద్ లోని భూలక్ష్మీ మాతా గుడిలో అకౌంటెంట్ పై యాసిడ్ దాడి జరిగింది. హ్యాపీ హోలీ అని చెప్పి గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు.
హ్యాపీ హోలీ అని చెప్పి రంగు వేస్తాడనుకుంటే ఏకంగా యాసిడ్ పోసి వెళ్ళిపోయాడో దుర్మార్గుడు. హైదరాబాద్ లోని సైదాబాద్ భూలక్ష్మీ గుడిలో అకౌంటెంట్ పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. దాడి చేసిన వెంటనే దుండగుడు బైక్ పై పారిపోయాడు. ఈ ఘటనలో గుడి అకౌంటెంట్ నర్సింగ్ రావ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని స్థానికులు యశోదా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు పండుగ పూటపరిగి శివారులోని మల్కాపూర్ దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సులో ప్రయాణికులు ఎక్కువమంది ఉండడంతో టిక్కెట్లు ఇచ్చేందుకు బస్సు సైడుకు ఆపే క్రమంలో మట్టి క్రుంగి బస్సు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.మొత్తం 90మందికి పైగా బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పగిరి నుంచి షాద్ నగర్ వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే డ్రైవెర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





