March 12, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Acid attack: చిత్తూరు యాసిడ్ దాడి ఘటన..15 నిమిషాల్లోనే నిందితుడు అరెస్ట్!

AP News: ఏపీ అన్నమయ్య జిల్లా యాసిడ్ దాడి నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రేమ పేరుతో మదనపల్లె అమ్మచెరువు మిట్ట గణేష్.. పార్వంపల్లి గౌతమిపై యాసిడ్ దాడికి పాల్పడి పారిపోగా 15 నిమిషాల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ ఆరాతీశారు



ప్రపోజ్ చేయడానికి ఇంటికెళ్లి..
ఈ మేరకు గుర్రంకొండ ప్యారంపల్లి గ్రామానికి చెందిన జనార్దన్, రెడ్డెమ్మ దంపతుల కుమార్తె గౌతమి (23)ని కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందని గణేష్ వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ప్రేమికుల రోజు సందర్భంగా ఆమెకు ప్రపోజ్ చేయడానికి ఇంటికెళ్లాడు. అయితే ఆమె ఒప్పుకోకపోవడంతో యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై నిందితుడిని 15 నిమిషాల్లో అరెస్ట్ చేశారు. యాసిడ్ దాడికి గురైన మహిళను, తల్లిదండ్రులను మదనపల్లి ఆసుపత్రిలో మంత్రి మండిపల్లి పరామర్శించారు. మంత్రి నారా లోకేష్‌ సైతం ఫోన్ లో బాధితురాలు గౌతమితో మాట్లాడి ధైర్యం చెప్పారు. నిందితుడు గణేష్ ను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

యాసిడ్ దాడులను సహించేది లేదు..
ఇక యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తిని కేవలం 15 నిమిషాల్లోనే అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపిచినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా ఉండేందుకు మహిళలు ముందస్తు జాగ్రత్తగా పోలీసులను ఆశ్రయించాలన్నారు. మెరుగైన వైద్యం కోసం గౌతమిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బెంగళూరుకు తరలించినట్లు చెప్పారు. ఆమెకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని లోకేష్‌ తెలిపారు. బాధితురాలు పూర్తిగా కోరుకునేంతవరకు ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. యాసిడ్ దాడికి గురైన మహిళకు ప్రభుత్వం తరఫున అన్ని సదుపాయాలు కల్పిస్తాం. యాసిడ్ దాడులను సహించేది లేదని హెచ్చరించారు లోకేష్

Also read

Related posts

Share via