వరంగల్ జిల్లా గిర్మాజిపేటలో రంజాన్ అనే యువకుడు 3 ఏళ్ల పాపపై హత్యాచార యత్నం చేశారు. పాప ఏడవడంతో గమనించిన స్థానికులు రంజాన్‌ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై ఫోక్సో, హత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
TG Crime: వరంగల్ నగరంలోని గిర్మాజిపేటలో కామాంధుడు రెచ్చిపోయాడు. పశువు కంటే హీనంగా ప్రవర్తించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రంజాన్ అనే యువకుడు అక్కడ నివసించే మూడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడవడంతో అక్కడి స్థానికులు అప్రమత్తమై వెంటనే స్పందించారు. నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి వెంటనే ఇంతేజార్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.
శిక్ష పడేలా చర్యలు..
చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన నిందితుడిపై POCSO చట్టంతో పాటు అత్యాచారం, బాలల రక్షణకు సంబంధించిన పలు తీవ్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పిల్లల భద్రత విషయంలో సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. నిందితుడిపై త్వరగా విచారణ జరిపి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చిన్నారి పరిస్థితి గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పాపకు తగిన వైద్య చికిత్స అందిస్తుండగా ఈ ఘటనపై జిల్లా అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది.
Also read
- సాహితీవేత్తా దుర్గాప్రసాద్ ఉగాది పురస్కారం ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- పరాభావ నామసంత్సరం అంటే అన్నీ పరాభావాలేనా? పండితులు ఏమంటున్నారంటే?
- Watch Video: ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. సైరన్ మోగడంతో పరార్! ఎక్కడంటే..
- ఆరుగురు మహిళలు.. ధూమ్ సినిమా రేంజ్లో ప్లాన్.. చివరకు జరిగిందిదే..
- ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ తండ్రి ఆశయం కోసం..





