హైదరాబాద్: వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన నగరంలో విషాదం నింపింది. పేట్ బషీరాబాద్ పోలీస్టేషన్ పరిధిలోని దూలపల్లికి చెందిన నవీన్‌చారి (28) బస్సు బాడీ కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి వినాయక మండపానికి నవీన్ ఏర్పాట్లు చేస్తున్నారు. గత వారంరోజులుగా వర్షాలు పడుతుండటంతో ముందు జాగ్రత్తగా మండపం పై నుంచి వర్షం నీరు కిందకు రాకుండా టార్పాలిన్ తో కడుగడం మొదలుపెట్టాడు.
ఒక చేత్తో ఐరన్ బైండింగ్ వైర్ పట్టుకుని మరో చేత్తో మండపం పైకి విసిరాడు. బైండింగ్ వైరు విద్యుత్ తీగలకు తగలడంతో నవీన్‌చారి షాక్‌తో కింద పడిపోయాడు. అయితే నవీన్ కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. నవీన్ కింద పడటం చూసిన వడ్డ శంకర్ అనే మరో వ్యక్తి కర్ర సహాయంతో నవీన్ చారిని పక్కకు తరలించే ప్రయత్నం చేయగా అతనికి కూడా షాక్ తగిలింది. దీంతో శంకర్ చారి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే శంకర్ చారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నవీన్ చారి మృతి చెందాడు. పండుగరోజే ఇద్దరు యువకులు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025