SGSTV NEWS
Andhra PradeshCrime

4 లక్షల రూపాయలకే పసికందు..



*వాట్సాప్ ద్వారా అమ్మకానికి ముక్కుపచ్చలారని చిన్నారులు*

*తాడేపల్లి నులకపేటలో ఓ వ్యక్తికి వాట్సాప్ లో ఆఫర్ పెట్టిన కిలాడీ మహిళ*

సంతానం లేని, కుటుంబాన్ని పోషించలేని దంపతులు టార్గెట్ గా సోషల్ మీడియా ద్వారా పసికందుల ఫోటోలు పంపి చిన్నారుల అమ్మకాలు, కొనుగోలు గుట్టుగా సాగుతున్నాయి

తాడేపల్లి నులకపేటలో గతం సంవత్సరం వరకు నివసించిన సామ్రాజ్యం అనే మహిళ స్థానికంగా చీరలు, వస్త్రాల వ్యాపారం పేరుతో స్థానికంగా ఉండే మహిళలను పరిచయం చేసుకుంది

గతంలో ఓ వ్యక్తితో నులకపేటలో సహజీవనం చేస్తూ ఇదే ప్రాంతంలో తాము భార్యాభర్తలుగా స్థానికులను నమ్మించింది

స్థానిక పరిచయాల నేపథ్యంలో కొంతమంది సంతానం లేని దంపతులకు, కుటుంబ పోషణ సరిగాలేని వారిని టార్గెట్ గా చేసుకొని వారి ఫోన్ నెంబర్లను తీసుకొని చిన్నారుల, పసికందుల ఫోటోలు వాట్సాప్ ద్వారా పంపిస్తూ నాలుగు, ఐదు లక్షల రూపాయలకు చిన్నారులను అమ్మడానికి  తన వద్ద అందుబాటులో ఉన్నారని అవసరమైన వారు ఎవరైనా ఉంటే తనకు సమాచారం ఇవ్వాలంటూ తెలిపేది

గతంలో సదరు మహిళ కుటుంబ వివాదాల్లో, వివిధ కేసుల వ్యవహారాల్లో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తిరుగుతూ తనకు పోలీస్ అధికారులు, సిబ్బందితో సత్సంబంధాలు ఉన్నాయని స్థానికులను మభ్యపెడుతుండేది

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మోసాలను కొనసాగిస్తూ తనకు బలమైన అండ ఉండాలని దుర్బుద్ధితో గతంలో 10 సంవత్సరాల పాటు సహజీవనం చేసిన వ్యక్తిని సైతం వదిలేసి మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ఓ సైనికోద్యోగిని కొద్ది నెలల క్రితం వివాహం చేసుకుని హైదారాబాద్ కు మకాం మార్చింది

కాగా దేశాన్ని రక్షించాల్సిన సైనిక ఉద్యోగి తన భార్య చేస్తున్న నేరాలను ప్రోత్సహిస్తుండటం హేయం

సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి కూత వేటు దూరంలో సామాన్య మహిళలను టార్గెట్ చేస్తూ కిలాడీలు గుట్టుగా సాగిస్తున్న నేరవృత్తిని అరికట్టడంలో పోలీస్ శాఖ వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది

సదరు నేరాలపై సమగ్రమైన విచారణ జరిపి కిలాడీల ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు

Also read

Related posts

Share this