October 16, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ప్రభుత్వాస్పత్రిలో శిశువు అపహరణ

• బందరు జీజీహెచ్ లో ఘటన

• నర్సు వేషంలో వచ్చి 5 రోజుల శిశువును అపహరించిన మహిళ

• నిందితురాలిని గుర్తించిన సెక్యూరిటీ సూపర్వైజర్

• అతనిచ్చిన సమాచారంతో నిందితురాలిని పట్టుకున్న పోలీసులు

• తల్లి చెంతకు క్షేమంగా శిశువు..

మచిలీపట్నం టౌన్: బందరు ప్రభుత్వాస్పత్రిలో తల్లి పొత్తిళ్లలో వెచ్చగా సేదదీరుతున్న ఐదు రోజుల శిశువును ఓ మహిళ అపహరించింది. నర్సు వేషంలో వచ్చి.. తల్లితో మాటలు కలిపి.. ఆమె నిద్రపోగానే శిశువును ఎత్తుకెళ్లిపోయింది. ఈ ఘటన మచిలీపట్నంలో కలకలం సృష్టించింది. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళానికి చెందిన చిట్టూరి స్వరూపరాణి ఈ నెల 8వ తేదీన డెలివరీ కోసం మచిలీపట్నంలోని సర్వజనాస్పతిలో చేరింది.

Also read :Crime news: భార్య గొంతు కోసి.. అనంతరం తానూ కోసుకొని..

9వ తేదీన మగ బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నర్సు వేషంలో వచ్చిన ఓ మహిళ.. స్వరూపరాణితో మాటలు కలిపింది. కొద్దిసేపటికి స్వరూపరాణి నిద్రలోకి జారుకోగా.. ఆ మహిళ శిశువును ఎత్తుకెళ్లిపోయింది. ఆ తర్వాత 15 నిమిషాలకు స్వరూపరాణి మెలుకువ వచ్చి లేచి చూడగా.. పొత్తిళ్లలోని శిశువు కనిపించలేదు. వెంటనే ఆమె తన తల్లిదండ్రులకు, భర్తకు సమాచారం ఇచ్చింది.

Also read :తిరుమల నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

వారు ఆస్పత్రి సిబ్బందికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని సీసీ టీవీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. స్వరూపరాణికి సహాయం చేసినట్లు నటించిన నర్సు వేషంలో ఉన్న మహిళే శిశువును తీసుకెళ్లినట్లు గుర్తించారు.

Also read :వైసీపీ నేత డాబా హౌస్ కూల్చివేత

సెక్యూరిటీ సూపర్వైజర్ సమాచారంతో..

కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో సెల్ఫోన్లు చోరీకి గురవ్వడంతో ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నిందితుడికి.. శిశువును కిడ్నాప్ చేసిన మహిళే బెయిల్ ఇచ్చిందని ఆస్పత్రి సెక్యూరిటీ సూపర్వైజర్ రాజు పోలీసులకు తెలియజేశాడు. పోలీ- సులు ఆ దిశగా దర్యాప్తు జరిపి ఆమె వివరాలు సేకరించారు.

Also read :Suicide: అప్పుల బాధతో గృహిణి ఆత్మహత్య

గంటల వ్యవధిలోనే ఆమె ఇంటికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకొని.. శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఉదయం ఆరు గంటలకల్లా పోలీసులు శిశువును క్షేమంగా తల్లి స్వరూపరాణి చెంతకు చేర్చారు. దీంతో స్వరూపరాణి సంతోషం వ్యక్తం చేసింది.

ఆడబిడ్డ కోసమని..!

నిందితురాలిని తమ్మిశెట్టి లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆమె స్థానిక రామానాయుడుపేట సెంటర్లో కోడిగుడ్ల వ్యాపారం నిర్వహిస్తోంది. ఆమెకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆడబిడ్డ కోసమని తాను శిశువును అపహరించానని నిందితురాలు విచారణలో తెలిపింది. తాను ఎత్తుకొచ్చింది మగ శిశువనే విషయాన్ని గమనించలేదని వెల్లడించింది.

కాగా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టాఫ్ నర్సు దీవెన, సెక్యూరిటీ గార్డు విజయలక్ష్మిని సస్పెండ్ చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేశ్ తెలిపారు. ఎస్ఎన్సీయూ విభాగంలోని ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఎఫ్ఎన్, సెక్యూరిటీ గార్డులకు చార్జ్ మెమోలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Also read :Vijaysai Reddy: మదన్‌ నన్ను రెండుసార్లు కలిశాడు.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు: విజయసాయిరెడ్డి

Related posts

Share via