SGSTV NEWS online
CrimeUttar Pradesh

చెల్లె పెళ్లికి గోల్డ్ రింగ్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడని భర్తతో గొడవ, దారుణంగా చంపించిన భార్య

UP Crime News: చెల్లె పెళ్లికి గోల్డ్ రింగ్ ఇచ్చాడన్న కోపంతో భార్య భర్తను దారుణంగా కొట్టి చంపించిన ఘటన సంచలనమైంది.

యూపీలో దారుణ ఘటన జరిగింది. వెడ్డింగ్‌ గిఫ్ట్‌ గురించి వచ్చిన గొడవలో భార్య భర్తని హత్య చేయించింది. చంద్రప్రకాశ్ మిశ్రా తన చెల్లి పెళ్లికి గోల్డ్‌ రింగ్‌, టీవీ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయంలోనే భార్య గొడవ పడింది. రెండు గిఫ్ట్‌లు ఇవ్వాల్సిన అవసరం ఏముందంటూ వాదించింది. కానీ అందుకు చంద్రప్రకాశ్ ఒప్పుకోలేదు. కచ్చితంగా ఇచ్చి తీరతానని చెప్పాడు. ఈ చిన్న గొడవ కాస్తా పెద్దదైంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న భార్య తన కుటుంబ సభ్యులతో ఇదంతా చెప్పింది. వెంటనే ఆమె సోదరుడు చంద్రప్రకాశ్‌పై దాడి చేశాడు. కర్రలతో దాదాపు గంటపాటు విచక్షణా రహితంగా కొట్టాడు. ఈ దెబ్బలకు తాళలేక బాధితుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ చికిత్స జరుగుతుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుని భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులనూ అరెస్ట్ చేశారు.

Also read

Related posts