April 11, 2025
SGSTV NEWS
Andhra Pradesh

వైయస్ జగన్మోహన్ రెడ్డి పై దొంగతనం కేసు నమోదుచేయాలి….బ్రాహ్మణ చైతన్య వేదిక

మహారాజశ్రీ గుంటూరు జిల్లా ఎస్పీ గారి దివ్య సముఖమునకు….. బ్రాడీపేట 4/10 నివాసి బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ వ్రాసుకున్న ఫిర్యాదు….*

గడిచిన ఐదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనాన్ని లూఠీచేసి నిబంధనలకు విరుద్ధంగా దోచుకున్నారు. తాడేపల్లి లోని తన సొంత ఇంటికి సుమారు రూ. 45.54 కోట్ల విలువైన ప్రజా ధనం వెచ్చించి హంగు, అర్భటాలతో విలాసవంతమైన మౌలిక సదుపాయాలు కల్పించుకున్నారు. ప్రజలు రక్తం చిందించి, చెమటోడ్చి కట్టిన పన్నులను ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించాల్సిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి తన సొంత ఇంటిలో ఫర్నిచర్, టెక్నికల్, డిజిటల్ ఎక్విప్మెంట్, పివిసి రూప్స్, మొబైల్ టాయిటెట్లు, కూలర్లు, ఓ.ఎల్.ఇ.డి. టివీలు, అత్యంత ఖరీదైన ఫర్నిచర్తో తయారు చేసిన టేబుల్స్, ఎయిర్ కండీషన్స్, ప్రిజ్లు వంటి ఎలకాట్రానిక్ పరికరాలు విద్యుత్ ట్రాన్స్ఫార్మరులు, హెచ్.టి. లెన్స్, అత్యాదునిక లైటింగ్ సిస్టమ్, ఆలయాల సెటింగ్స్ వంటి వాటి కోసం ప్రభుత్వ సోమ్మును విచలవిడిగా ఖర్చు చేసినారు. ముఖ్యమంత్రి నివాసానికి భద్రత నిమిత్తం ఇతర అవసరాల కోసం ఎంత ఖర్చు చేయాలనే దానిపై ప్రత్యకంగా ప్రభుత్వ మార్గ దర్శకాలు వున్నాయి. వాటి అన్నింటిని తుంగలో తొక్కి ముఖ్యమంత్రి హోదాలో వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆర్ & బి అధికారులకు ఆదేశాలు ఇచ్చి కోట్ల రూపాయాల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం పేరుతో ఆయన సొంత ఇంటికి ఇంత పెద్ద మొత్తములో ఖర్చు చేయటం చట్ట రీత్యా నేరం.

ప్రభుత్వ ఆస్తులను చోరి చేసి దొంగతనంగా వినియోగించుకుంటున్న ఎమ్.ఎల్.ఏ అయిన జగన్ గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అత్యంత దారుణంగా పరాజయం చవిచూసారు. ఆయనకు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. ప్రస్తుతం ఆయన గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన క్యాంప్ కార్యలయము సొంత ఇంటి లాగా మారిపోయింది. దీనితో ఆయన బాధ్యతగా ఆదే రోజున ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్, టెక్నికల్ ఎక్యూప్మెంట్, డిజిటల్ ఎక్యూప్మెంట్, ఎలక్ట్రానిక్ పరికరాలు, పి.వి.సి. రూప్స్, మొబైల్ టాయిలేట్లు, కూలర్లు, ఎయిర్ కండీషనర్లు, ఓ.ఎల్.ఇ.డి. టివీలు, అత్యంత ఖరీదు అయిన పర్నిచర్స్తో చేసిన టెబుల్స్, సోఫా సెట్స్ వంటి అన్ని కరాలు అయిన సామాగ్రిని తక్షణం ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి వుంది. అయినప్పటికీ ప్రభుత్వ సొమ్మును చోరి చేసి దొంగతనంగా తన ఇంటిలో దర్జాగా వినియోగించుకుంటూ మరో నేరానికి పాల్పడారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటమై కాకుండా తన సొంత ఇంటికి వాడుకోవటం అధికార దుర్వినియోగంతో పాటు, ప్రభుత్వ ఆస్తులను దొంగచాటుగా వినియోగించు కుంటున్న వ్యవహారం పై విచారణ జరిపి అందుకు బాధ్యులు అయిన వై.యస్. జగన్మోహన్రెడ్డితో పాటు అందుకు సహకరించిన అధికారులపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకొని తన ఇంటిలో దొంగచాటుగా వినియోగించుకుంటున్న ఫర్నిచర్ పైన తెలియచేసిన ఇతర సామాగ్రి మొత్తన్ని స్వాధినం చేసుకోవాలని వేడుకుంటున్నాను. అదే విధముగా లూఠీ చేసిన ప్రజా ధనాన్ని నిందితులనుంచి రికవరి చేయాలని బాధ్యత గలిగిన ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా కోరుకుంటున్నాను అని అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ (క్రైం) ఏ. శ్రీనివాసరావు కు శ్రీధర్, కొమ్మినేని సాంబశివరావు రావిపాటి సాయి తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఫర్నిచర్ ని ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగతనం చేశాడని ప్రభుత్వ వస్తువులు ప్రభుత్వానికి అప్పజెప్పకపోవటాన్ని దొంగతనమే అంటారని, గతంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన కోడలు శివ ప్రసాద్ కాంప్ కార్యాలయానికి ఫర్నిచర్ తీసుకువెళ్లమని అసెంబ్లీ కార్యదర్శి రాతపూర్వకమైన లేక ఇచ్చిన పట్టిచ్చుకుపోవడంతో వైయస్ జగన్ ప్రభుత్వం కోడెల శివప్రసాద్ ను దొంగగా చిత్రీకరించి ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆయన ఆత్మహత్యకు కారకుడయ్యాడని, అప్పుడు వర్తించని చట్టము న్యాయము వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించవని శ్రీధర్ ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి పై దొంగతనం కేసు నమోదు చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తెలుగు యువత మాజీ అధ్యక్షుడు కమ్మినేని సాంబశివరావు మాట్లాడుతూ ఎటువంటి తప్పు చేయని కోడెల శివప్రసాద్ను మానసికంగా వేధించి ఆయన ఆత్మహత్యకు పురిగొలిపాడని , కోడెల సుప్రసాద్ ఆత్మ జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూనే ఉంటుందని కొమ్మినేని హెచ్చరించారు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయి మాట్లాడుతూ వైజాగ్ ఋషికొండ క్యాంప్ కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి బాత్ టబ్ కు 25 లక్షల రూపాయలు అల్యూమినియం డోర్లకు 70 కోట్ల రూపాయలు జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడని ఇప్పుడు అక్కడ ఎవరు నివాసముండే పరిస్థితి కూడా లేదని ఇట్లా ఇడుపులపాయలో కూడా ప్రభుత్వ ధనాన్ని తన సొంత విలాస జీవితానికి వాడుకోవటం కోసం దుర్వినియోగం చేశాడని దీనిపైన సిఐడి లేదా సిబిఐ ఎంక్వయిరీ వేసి విచారణ చేపట్టి అధికారులను చట్టరీత్యా కేసులు నమోదు చేసి అరెస్టు చేసి ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేయాలని సాయి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎండపల్లి శబరి వంగవీటి చైతన్య చిలుమూరు ఫణి తెలుగు యువత నరేష్ తదితరులు పాల్గొన్నారు

https://youtu.be/-w3a2AioY4s?si=qy3JrczcK1oDirYu

Related posts

Share via