February 4, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

ఏపీలో ఘోర విషాదం! కొడుకు హిజ్రాను ప్రేమించాడని.. పేరెంట్స్ ఏం చేశారంటే


నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు హిజ్రాను ప్రేమించాడనే మనస్తాపంతో తల్లిదండ్రులు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. దంపతులిద్దరూ మృతి చెందారు.

Nandyal District:  సాధారణంగా కన్నబిడ్డల  ప్రేమ తల్లిదండ్రులు బతికిస్తుందని చెబుతారు. కానీ ఆ కన్నబిడ్డ ప్రేమే వారి ప్రాణం తీయడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ విషాదకరమైన ఘటన ఆంద్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది

హిజ్రాను ప్రేమించాడని
నంద్యాల జిల్లా SBI కాలనీలో సుబ్బరాయుడు,సరస్వతి దంపతులకు సునీల్ అనే కొడుకు ఉన్నాడు. అయితే కొడుకు సునీల్ ఒక హిజ్రాను ప్రేమించాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు సుబ్బారాయుడు, సరస్వతి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది… అప్పటికే పరిస్థితి విషమించడంతో దంపతులిద్దరూ మృతి చెందారు.

Also Read

Related posts

Share via