Zodiac sign: దాదాపు 500 ఏళ్ల తర్వాత అరుదైన గ్రహ మార్పులు సంభవిస్తున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల 3 రాశుల వారికి మంచి రోజులు రాబోతున్నాయంటా.? ఇంతకీ ఆ మూడు రాశులు ఏంటి.? వారికి ఆ మంచి ఏంటంటే.?
నవంబర్ నెలలో అరుదైన గ్రహ మార్పులు
ఈ నవంబర్ నెల జ్యోతిషశాస్త్ర పరంగా అత్యంత విశిష్టమైనదిగా చెబుతున్నారు. ఐదు శతాబ్దాల తర్వాత ఇంత విశేషమైన గ్రహ సంచారం జరుగుతోంది. శని గ్రహం మీనరాశిలో ప్రత్యక్షంగా సంచరించగా, అదే సమయంలో బృహస్పతి తిరోగమన కదలికలో ఉన్నాడు. ఈ రెండు గ్రహాల స్థితి మార్పు కొన్ని రాశులపై సానుకూల ప్రభావం చూపనుంది.
శని-గురువుల కదలికల ప్రభావం
శని సాధారణంగా కర్మ, నియమం, శ్రమను సూచిస్తాడు. ఇక గురువు జ్ఞానం, ధనం, అభివృద్ధికి ప్రతీక. ఈ రెండింటి కదలిక ఒకే నెలలో జరగడం చాలా అరుదైన పరిణామం. శని ప్రత్యక్షం కావడం వల్ల ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. బృహస్పతి తిరోగమనమవడం వల్ల దాచిన అవకాశాలు వెలుగులోకి వస్తాయి. మొత్తానికి, ఈ సంయోగం జీవితంలో కొత్త మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది.
కుంభరాశి వారికి గోల్డెన్ టైమ్
కుంభరాశి వారికి ఈ నెల నిజంగా శుభసూచకం. శని రెండవ ఇంట్లో, గురువు ఆరో ఇంట్లో సంచరిస్తున్నందున ఆర్థిక ప్రగతి, సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. వ్యాపారవేత్తలకు లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి. కార్యాలయంలో ఎదుగుదల అవకాశాలు వస్తాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి అందుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
మిథునరాశి వారికి కొత్త ఆరంభాలు
మిథునరాశి వారికి గురు తిరోగమనం, శని ప్రత్యక్షం కలయిక కొత్త ఆస్తి కొనుగోలు, కెరీర్ వృద్ధికి దారితీస్తుంది. పదోన్నతులు, ప్రతిష్ట పెరుగుతాయి. పని వాతావరణం అనుకూలంగా మారుతుంది. తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి. పిల్లల విద్యా, భవిష్యత్తు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకునే సమయం ఇది.
మకరరాశి వారికి శాంతి, స్థిరత్వం
మకరరాశి వారికి ఈ సంయోగం జీవితం కొత్త దిశలో ముందుకు తీసుకెళ్తుంది. శని మూడవ ఇంట్లో, గురువు ఏడవ ఇంట్లో ఉండడంతో వివాహ జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశీ ప్రయాణాలు, ఆస్తి కొనుగోళ్లు సాధ్యమవుతాయి. ధార్మికత, ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, కుటుంబం రెండింటిలోనూ స్థిరత్వం వస్తుంది.
